విధాత: గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎస్టీల రిజర్వేషన్ 6 నుంచి 10 శాతానికి పెంచుతూ సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రిజర్వేషన్లు పెంచడంతో అందుకు అనుగుణంగా సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌లో మార్పులు జరుగనున్నాయి. నియామకాల్లో ప్రతి పదో ఉద్యోగం ఎస్టీలకు దక్కనుంది.