బీజేపీ ఎమ్మెల్యే బంగ్లాలో యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

  • By: Somu    latest    Sep 25, 2023 10:39 AM IST
బీజేపీ ఎమ్మెల్యే బంగ్లాలో యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌
  • యూపీలో ఘ‌ట‌న‌.. గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో గొడ‌వే కార‌ణం

విధాత‌: బీజేపీ ఎమ్మెల్యే అధికారిక‌ నివాసంలో యువకుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. యువకుడు తన ప్రియురాలితో గొడ‌వ ప‌డి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్టు పోలీసులు తెలిపారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం లక్నోలోని బక్షి కా తలాబ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ శుక్లా బంగ్లాలో సోమ‌వారం ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మృతుడిని ఎమ్మెల్యే యోగేష్ శుక్లా మీడియా సెల్‌లో పని చేసే శ్రేష్ట తివారీ (24)గా గుర్తించారు.


ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ఫ్లాట్‌లో తివారీ ఒంటరిగా ఉన్నాడు. తివారీ తన స్నేహితురాలికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటాన‌ని బెదిరించాడు. భ‌య‌ప‌డిన ఆమె పోలీసులకు సమాచారం అందించి సంఘటనా స్థలానికి చేరుకున్న‌ది. తలుపు లోపలి నుంచి గ‌డియ‌పెట్టుకొని ఉరేసుకున్నాడు.


పోలీసులు వచ్చి త‌లుపు పగులగొట్టి చూడగా, లోపల తివారీ శవమై కనిపించాడు. వీరిద్దరూ నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవల ఇద్ద‌రు ప్రేమికుల మ‌ధ్య గొడ‌వ త‌లెత్తింది. దాంతో మ‌న‌స్తాపం చెంది తివారీ బ‌ల‌వ‌న్మ‌రణానికి పాల్ప‌డిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు ఘ‌ట‌నాస్థ‌లంలో ఎలాంటి సూసైడ్ నోట్ ల‌భించ‌లేద‌ని పేర్కొన్నారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.