Titanic | టైటానిక్ శిథిలాల దగ్గరకు వెళ్తున్న జలాంతర్గామి గల్లంతు.. అందులో బిలియనీర్
Titanic | ఐదుగురి ప్రాణాలకు ముప్పు ! విధాత: టైటానిక్ (Titanic)ని చూడటానికి పర్యాటకులను తీసుకెళ్లే జలాంతర్గామి (Submarine) ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఆగ్నేయ కెనడా సముద్ర ప్రాంతంలో మునిగిపోయిన దీని కోసం యూఎస్ కోస్ట్‌గార్డ్ (US Coast Guard) రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. జలాంతర్గామి ఆచూకీని తెలుసుకోడానికి అన్ని వనరులనూ మోహరించామని సబ్‌మెరైన్ నిర్వహిస్తున్న ఓషియన్ గేట్ ఎక్స్‌పెడెషన్స్ సంస్థ ప్రకటించింది. ఇందులో పర్యాటకులు ఉన్నారా లేదా అసలు ఎంత మంది ఉన్నారనే విషయంపై స్పందించలేదు. […]

Titanic |
- ఐదుగురి ప్రాణాలకు ముప్పు !
విధాత: టైటానిక్ (Titanic)ని చూడటానికి పర్యాటకులను తీసుకెళ్లే జలాంతర్గామి (Submarine) ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఆగ్నేయ కెనడా సముద్ర ప్రాంతంలో మునిగిపోయిన దీని కోసం యూఎస్ కోస్ట్‌గార్డ్ (US Coast Guard) రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది.
జలాంతర్గామి ఆచూకీని తెలుసుకోడానికి అన్ని వనరులనూ మోహరించామని సబ్‌మెరైన్ నిర్వహిస్తున్న ఓషియన్ గేట్ ఎక్స్‌పెడెషన్స్ సంస్థ ప్రకటించింది. ఇందులో పర్యాటకులు ఉన్నారా లేదా అసలు ఎంత మంది ఉన్నారనే విషయంపై స్పందించలేదు. అయితే ఐదో టైటానిక్ యాత్రకు సిద్ధం అనే ప్రకటన మాత్రం ఆ సంస్థ సైట్‌పై కనిపిస్తోంది. దీని ప్రకారం పర్యాటకులతో కూడిన సబ్‌మెరైన్ యాత్ర గత వారం మొదలై గురువారానికి పూర్తి కావాల్సి ఉంది.
ఆదివారం న్యూఫౌండ్‌లాండ్‌లోని సెయింట్ జాన్ పోర్టు నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ నౌక గంటా 45 నిమిషాలకే గల్లంతైంది. దీంతో పాటు రక్షణగా ఉండే పోలార్ ప్రిన్స్ ఐస్ బ్రేకర్ నౌక సబ్‌మెరైన్ ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆచూకీ గల్లంతైన సబ్‌మెరైన్‌లో ఒక పైలట్, నలుగురు ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది.
వీరిలో హమీష్ హార్డింగ్ అనే యూకే బిలియనీర్‌కు సముద్రంలో అత్యంత లోతున ఎక్కువ సమయం గడిపిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు ఉండటం విశేషం. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 96 గంటల పాటు వారికి ఆక్సిజన్ సౌకర్యం ఉంటుందని అప్పటి లోపు సబ్‌మెరైన్ ఆచూకీని కనుగొనాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ యాత్ర కోసం ఒక్కో వ్యక్తికి సబ్‌మెరైన్ కంపెనీ 2,50,000 డాలర్ల ( సుమారు రూ.2 కోట్లు)ను సంస్థ ఛార్జ్ చేస్తోంది. అట్లాంటిక్ సముద్రం అంతర్భాగంలో 600 కి.మీ. లోతున ఉన్న టైటానిక్ వద్దకు ఇది చేరుకోవాల్సి ఉంటుంది. దీనిని సబ్‌మెరైన్ అని పిలిచినప్పటికీ ఇది ఒక సబ్‌మెర్సిబిల్ మాత్రమే. సబ్‌మెరైన్ లాగ దీనికంటూ సొంత ఇంధనం ఉండదు.
దానితో వచ్చిన సహాయక నౌక ద్వారా మాత్రమే ఇది పోర్ట్‌కు తిరిగి చేరుకోగలదు. ఈ ఘటనలో టైటానిక్ శిథిలాలు ఉన్న ప్రాంతంలో సముద్ర ఉపరితలం నుంచి పోలార్ ప్రిన్స్ అనే నౌక సబ్‌మెర్సిబిల్‌ను సముద్రంలోకి విడవగా.. అది గల్లంతైంది. చివరి సారిగా సబ్‌మెరైన్ సిగ్నల్ వచ్చిన ప్రదేశం చాలా నిర్మానుష్య ప్రదేశమని యూఎస్ కోస్ట్‌గార్డ్ అధికారి ఒకరు తెలిపారు.
తొలి ప్రయాణమే చివరి మజిలీ..
1997లో స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసిన టైటానిక్ సినిమాతో ప్రపంచానికి ఈ భారీ ఓడ సుపరిచితమే. దీని మొదటి ప్రయాణమే చివరి మజిలీ కూడా కావడం విషాదం. 1912లో ఇంగ్లండ్ నుంచి అమెరికాకు తన మొదటి ట్రిప్‌ను ప్రారంభించిన టైటానిక్.. ఐస్‌బర్గ్‌ను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో సుమారు 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.