Supreme Court: గవర్నర్‌కు నోటీసుల జారీకి సుప్రీం నిరాకరణ.. కేసు మార్చి 27కు వాయిదా

విధాత: గవర్నర్ (Governor) దగ్గర పెండింగ్ (pending) బిల్లుల అంశంపై సుప్రీంకోర్టు (Supreme court)లో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) వేసిన పిటిషన్ (Petition)విచారణ సందర్భంగా గవర్నర్‌కు నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. కేంద్రానికి నోటీస్‌లు ఇస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్రానికి కూడా నోటీసులు వద్దని, కొన్ని బిల్లులను గవర్నర్ ఆమోదించారని, పూర్తి వివరాలు తెలుసుకొని నివేదిక సమర్పిస్తామని తనకు కొంత గడువు కావాలని సోలిసిటర్ జనరల్ […]

Supreme Court: గవర్నర్‌కు నోటీసుల జారీకి సుప్రీం నిరాకరణ.. కేసు మార్చి 27కు వాయిదా

విధాత: గవర్నర్ (Governor) దగ్గర పెండింగ్ (pending) బిల్లుల అంశంపై సుప్రీంకోర్టు (Supreme court)లో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) వేసిన పిటిషన్ (Petition)విచారణ సందర్భంగా గవర్నర్‌కు నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది.

ఈ కేసులో కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. కేంద్రానికి నోటీస్‌లు ఇస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్రానికి కూడా నోటీసులు వద్దని, కొన్ని బిల్లులను గవర్నర్ ఆమోదించారని, పూర్తి వివరాలు తెలుసుకొని నివేదిక సమర్పిస్తామని తనకు కొంత గడువు కావాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. దీంతో కేసును మార్చి 27కు వాయిదా వేసింది.