మనీష్‌ సిసోడియాకు సుప్రీం షాక్‌.. నేరుగా వస్తారా? అంటూ ప్రశ్న

విధాత‌: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా(Manish Sisodia)కు సుప్రీంకోర్టులో షాక్‌ తగిలింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ ధర్మాసనం పిటిషన్‌పై వాదనలు విన్నది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో ఘటన జరిగినందున తాము జోక్యం చేసుకోలేమని కోర్టు […]

  • Publish Date - February 28, 2023 / 12:48 PM IST

విధాత‌: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా(Manish Sisodia)కు సుప్రీంకోర్టులో షాక్‌ తగిలింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అయితే, పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ ధర్మాసనం పిటిషన్‌పై వాదనలు విన్నది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

ఢిల్లీలో ఘటన జరిగినందున తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఢిల్లీలో ఉన్నంత మాత్రాన నేరుగా సుప్రీంకోర్టుకు రావడమేంటని ప్రశ్నించింది. ఢిల్లీలో ఘటన జరిగినంత మాత్రాన ఈ కేసు సుప్రీంకోర్టుకు వస్తుందని అర్థం కాదని ధర్మాసనం పేర్కొంది.

ఈ విషయంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ముందు పరిష్కారాలు ఉన్నాయని, ఆర్టికల్‌ 32 ప్రకారం పిటిషన్‌ విచారణకు స్వీకరించడానికి ఇష్టపడడం లేదని తెలిపింది. ఈ మేరకు పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం లేదని చెప్పింది. మనీష్‌ సిసోడియా తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి వాదనలు వినిపించారు.

ఈ కేసులో ఆయన అన్ని విధాలా విచారణకు సహకరిస్తున్నారని, అరెస్ట్‌పై స్టే విధించాలని కోరారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను ఆదివారం సీబీఐ అరెస్టు చేసిన విషయం విధితమే. అరెస్టు తర్వాత సోమవారం ఢిల్లీ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి, కస్టడీకి కోరింది.

సీబీఐ విజ్ఞప్తి మేరకు ఈ మేరకు మార్చి 5వ తేదీ వరకు కస్టడీకి ఇచ్చింది. మద్యం లైసెన్స్‌ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లుగా సిసోడియాపై ఆరోపణలున్నాయి. అయితే, కావాలనే సిసోడియాను అరెస్టు చేసినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు.