Suryapet | అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపల్ సిబ్బందిపై గొడ్డలితో దాడి

Suryapet విధాత: సూర్యాపేటలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపల్ ఉద్యోగిపై దాడి ఘటన చోటు చేసుకుంది. శనివారం జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపాలిటీ ఉద్యోగి బిక్షం పై అక్రమ నిర్మాణం చేపడుతున్న భద్రయ్య అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ మున్సిపాలిటీ ఉద్యోగిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు . ఈ మేరకు సూర్యాపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగి బిక్షంను జిల్లా కలెక్టర్ వెంకట్రావు పరామర్శించి వివరాలు […]

  • Publish Date - May 6, 2023 / 04:55 PM IST

Suryapet

విధాత: సూర్యాపేటలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపల్ ఉద్యోగిపై దాడి ఘటన చోటు చేసుకుంది. శనివారం జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపాలిటీ ఉద్యోగి బిక్షం పై అక్రమ నిర్మాణం చేపడుతున్న భద్రయ్య అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ మున్సిపాలిటీ ఉద్యోగిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు .

ఈ మేరకు సూర్యాపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగి బిక్షంను జిల్లా కలెక్టర్ వెంకట్రావు పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, ప్రసాద్ ఉన్నారు.

Latest News