Election Symbol | ఎన్నికల గుర్తులు.. KCRకు హ్యాపీ.. పవన్‌కు బీపీ

Election symbol ఎన్నికల గుర్తుల అంశం తెల్చేసిన ఈసీ విధాత: ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకు గుర్తులు కీలకం.. ఆ గుర్తు(Symbol) ప్రజల్లోకి ఎంత విస్తృతంగా వెళితే పార్టీ అంత బలంగా ఉన్నట్లు.. అంత ఎక్కువగా ఓట్లు పడతాయి.. పదేపదే గుర్తు గురించి జనాలకు జ్ఞాపకం చేసే పని ఉండదు.. ఇదే సమయంలో అలాంటి ఎన్నికల గుర్తు… లేదా అలాంటి గుర్తును పోలిన ఇంకో గుర్తు వేరే పార్టీకి కానీ అభ్యర్థికి కానీ వస్తె పొరపాటున కొందరు […]

  • Publish Date - May 18, 2023 / 01:12 PM IST

Election symbol

  • ఎన్నికల గుర్తుల అంశం తెల్చేసిన ఈసీ

విధాత: ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకు గుర్తులు కీలకం.. ఆ గుర్తు(Symbol) ప్రజల్లోకి ఎంత విస్తృతంగా వెళితే పార్టీ అంత బలంగా ఉన్నట్లు.. అంత ఎక్కువగా ఓట్లు పడతాయి.. పదేపదే గుర్తు గురించి జనాలకు జ్ఞాపకం చేసే పని ఉండదు.. ఇదే సమయంలో అలాంటి ఎన్నికల గుర్తు… లేదా అలాంటి గుర్తును పోలిన ఇంకో గుర్తు వేరే పార్టీకి కానీ అభ్యర్థికి కానీ వస్తె పొరపాటున కొందరు ఓటర్లు అసలు పార్టీ గుర్తుగా పొరబడి కొసరు అభ్యర్థికి ఓటేసి అసలు అభ్యర్థికి నష్టం చేకూర్చిన సందర్భాలూ ఉన్నాయి.

అయితే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ కు ఈ విషయంలో కాస్త రిలీఫ్ దొరికింది.. బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారును ఇంచుమించుగా పోలి ఉన్న నాలుగు గుర్తులను ఈసీ నిషేధించింది. ఈ మేరకు ఆటోరిక్షా హ్యాట్ (టోపీ) ఇస్త్రీ పెట్టె, ట్రక్ గుర్తులను నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

తమ గుర్తు అయిన కారును పోలినట్టు ఉన్న గుర్తుల వల్ల తమకు ఎన్నికల్లో నష్టం జరుగుతోందని.. వివరిస్తూ బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తమ పార్టీ గుర్తు అయిన కారును పోలి ఉన్న పలు గుర్తులపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ తెలంగాణల్లో కారును పోలి ఉన్న గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని కోరింది.

దీంతో ఎన్నికల్లో ఆయా పార్టీలకు కేటాయించే గుర్తుల జాబితాను ఈసీ విడుదల చేసింది. ఈసారి జారీ చేసిన గుర్తుల జాబితాలో బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసిన గుర్తులను తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ కేటాయించడం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ప్రస్తుతం ఉన్న గ్లాసు గుర్తు ఎగిరిపోయేలా ఉంది. దాన్ని ఫ్రీ సింబల్ గా గుర్తిస్తూ ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది.

దీంతో ఆ గ్లాస్ గుర్తు వేరే అభ్యర్థులకు కేటాయించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఆంధ్రలో జనసేన అభ్యర్థులు ఎన్నిచొట్ల పోటీ చేస్తే అన్నిచోట్లా వేర్వేరు గుర్తులు వస్తాయి తప్ప అందరికీ కలిపి ఒకేగుర్తు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అంటే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో గుర్తు మీద పోటీ చేస్తే ప్రచారం చేయడం.. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కష్టం అవుతుందని క్యాడర్ భయపడుతోంది.