Tabu | మళ్లీ నాగ్ సినిమాలో టబు.. ఇక రచ్చ రచ్చే!

Tabu | టాలీవుడ్ సినిమాలలో ఎవర్ గ్రీన్ కపుల్స్‌గా పేరుగాంచిన హీరోహీరోయిన్లలో టాప్ స్థానంలో నిలిచే పేర్లు నాగార్జున, టబు. సిసింద్రీ సినిమాలో టబు, నాగార్జునతో కలిసి ప్రేయసిగా ఒక పాటలో కనిపించి మెప్పించింది. ఆ తరువాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడే’ సినిమాలు ఇప్పటికీ బుల్లితెరపై సందడి చేస్తుంటాయి. ఆ సినిమాలలో వీరి మధ్య ఉండే కెమిస్ట్రీ కుర్రకారుని బాగా ఆకట్టుకున్నాయి. లవ్ అండ్ ఎఫెక్షన్ మూవీస్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌ను […]

  • By: krs    latest    Jul 14, 2023 3:29 AM IST
Tabu | మళ్లీ నాగ్ సినిమాలో టబు.. ఇక రచ్చ రచ్చే!

Tabu |

టాలీవుడ్ సినిమాలలో ఎవర్ గ్రీన్ కపుల్స్‌గా పేరుగాంచిన హీరోహీరోయిన్లలో టాప్ స్థానంలో నిలిచే పేర్లు నాగార్జున, టబు. సిసింద్రీ సినిమాలో టబు, నాగార్జునతో కలిసి ప్రేయసిగా ఒక పాటలో కనిపించి మెప్పించింది. ఆ తరువాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడే’ సినిమాలు ఇప్పటికీ బుల్లితెరపై సందడి చేస్తుంటాయి. ఆ సినిమాలలో వీరి మధ్య ఉండే కెమిస్ట్రీ కుర్రకారుని బాగా ఆకట్టుకున్నాయి. లవ్ అండ్ ఎఫెక్షన్ మూవీస్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఎంతగానో అలరించాయి. ఆ తరువాత వీరి కాంబినేషన్‌లో పెద్దగా సినిమాలు ఏవీ రాలేదు.

నాగార్జున టాలీవుడ్‌లో మన్మథుడిలా ఓ వెలుగు వెలుగుతుంటే.. టబు బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయిపోయింది. మన్మథుడు, ఊపిరి, సోగ్గాడే చిన్నినాయనా, మనం, బంగార్రాజు వంటి హిట్ సినిమాలతో నాగార్జున దూసుకుపోతున్నాడు. ఇక టబు విషయానికి వస్తే..టాలీవుడ్‌లో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీలో ఆయనకి మదర్‌గా నటించింది. అటు బాలీవుడ్‌లోనూ కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన ‘భూల్ భూలాయా’ చిత్రంలో డ్యూయల్ రోల్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

అయితే ఇంత వరకు టబు పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో టబుకి నాగార్జునకి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ మాములుగా కాదు.. ఓ రేంజ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. నాగార్జునకి మరో ఫ్యామిలీగా ఆమె పేరు వినిపించేది. అయితే వారి మధ్య ఉన్నది ఏంటనేది పక్కన పెడితే.. టబు పేరు వినగానే గుర్తొచ్చే పేరు మాత్రం నాగార్జునదే అంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. అలా వారి కాంబినేషన్‌ సినిమా ఇండస్ట్రీలో నిలబడిపోయింది.

ఇక విషయానికి వస్తే ఈ ఎవర్ గ్రీన్ జంట మరోసారి జంటగా నటించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. RX 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో కింగ్ నాగార్జున ఓ సినిమాకు ఓకే చెప్పినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా టబు‌ని తీసుకోవాలనే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు టబు ఒప్పుకున్నారా.. లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.

ఒకవేళ టబు ఒప్పుకుంటే మరోమారు ఈ జంటని సిల్వర్ స్క్రీన్ మీద చూడొచ్చు. చూడటం అటుంచితే.. వారిద్దరూ మళ్లీ కలిసి పని చేస్తున్నారంటే.. ఇండస్ట్రీలో మొదలయ్యే రచ్చే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం అజయ్ భూపతి ‘మంగళవారం’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ మూవీ రిలీజ్ తరువాత అజయ్ భూపతి, నాగార్జునల చిత్రం సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.