భూకంపం ధాటికి క‌దిలిన రైలు.. వీడియో

విధాత: తైవాన్‌లో ఆదివారం భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. యూఎస్ జియోలాజిక‌ల్ స‌ర్వే రిపోర్ట్ ప్ర‌కారం రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త 6.9గా న‌మోదైంది. భారీ భూప్ర‌కంప‌న‌ల నేప‌థ్యంలో జ‌పాన్ సునామీ హెచ్చ‌రిక జారీ చేసింది. అయితే భూకంపం సంభ‌వించిన నేప‌థ్యంలో స్టేష‌న్‌లో ఆగి ఉన్న ఓ రైలు అటు ఇటు క‌దిలింది. దీంతో స్టేష‌న్‌లో ఉన్న ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. త‌మ ప్రాణాల‌ను కాపాడుకునేందుకు ప్ర‌యాణికులు య‌త్నించారు. భూకంపం ధాటికి యూలీ గ్రామంలో ప‌లు భ‌వ‌నాలు కుప్ప‌కూలాయి. […]

భూకంపం ధాటికి క‌దిలిన రైలు.. వీడియో

విధాత: తైవాన్‌లో ఆదివారం భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. యూఎస్ జియోలాజిక‌ల్ స‌ర్వే రిపోర్ట్ ప్ర‌కారం రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త 6.9గా న‌మోదైంది. భారీ భూప్ర‌కంప‌న‌ల నేప‌థ్యంలో జ‌పాన్ సునామీ హెచ్చ‌రిక జారీ చేసింది.

అయితే భూకంపం సంభ‌వించిన నేప‌థ్యంలో స్టేష‌న్‌లో ఆగి ఉన్న ఓ రైలు అటు ఇటు క‌దిలింది. దీంతో స్టేష‌న్‌లో ఉన్న ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. త‌మ ప్రాణాల‌ను కాపాడుకునేందుకు ప్ర‌యాణికులు య‌త్నించారు.

భూకంపం ధాటికి యూలీ గ్రామంలో ప‌లు భ‌వ‌నాలు కుప్ప‌కూలాయి. శ‌నివారం కూడా అక్క‌డ భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త 6.6గా న‌మోదైంది. అయితే ఆదివారం సంభ‌వించిన భూప్ర‌కంప‌న‌లు తీవ్ర న‌ష్టాన్ని క‌లిగించాయి.

తైవాన్‌లో 1999, సెప్టెంబ‌ర్‌లో భూకంపం సంభ‌వించ‌డంతో 2,400 మంది ప్రాణాలు కోల్పోయారు. నాడు భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 7.6గా న‌మోదైంది.