Tamannah | మిల్కీ బ్యూటీ తమన్నా తన అందచందాలతో కుర్రకారు హృదయాలని కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కొన్ని దశాబ్ధాల నుండి తన నటనతో పాటు గ్లామర్‌తో రచ్చ చేస్తున్న తమన్నా ఇప్పుడు సినిమాలు , వెబ్ సిరీస్‌లు చేస్తూ ప్రేక్షకులకి పసందైన వినోదం పంచుతుంది. ఇటీవల ఆమె వెబ్ సిరీస్ లలో చాలా బోల్డ్ గా నటిస్తుండగా, దానిపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ మిల్కీ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు. కొద్ది రోజులక్రితం వరుస […]
Tamannah |
మిల్కీ బ్యూటీ తమన్నా తన అందచందాలతో కుర్రకారు హృదయాలని కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కొన్ని దశాబ్ధాల నుండి తన నటనతో పాటు గ్లామర్‌తో రచ్చ చేస్తున్న తమన్నా ఇప్పుడు సినిమాలు , వెబ్ సిరీస్‌లు చేస్తూ ప్రేక్షకులకి పసందైన వినోదం పంచుతుంది. ఇటీవల ఆమె వెబ్ సిరీస్ లలో చాలా బోల్డ్ గా నటిస్తుండగా, దానిపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయినప్పటికీ మిల్కీ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు. కొద్ది రోజులక్రితం వరుస వెబ్ సిరీస్‌లతో పలకరించిన తమన్నా బేబి రీసెంట్ గా జైలర్, భోళా శంకర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది . జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం దిశగా దూసుకుపోతుండగా, భోళా శంకర్ మాత్రం నిరాశ పరచింది.
అయితే హీరోయిన్స్‌కి బాడీ షేమింగ్ విమర్శలు రావడం సర్వసాధారణం. అయితే తమన్నాలాంటి అందగత్తెపై కూడా బాడీ షేమింగ్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొందరు తనని చూసి హెడ్ లైట్స్ లేవంటూ దారుణంగా ఆమె ఎద భాగాలపై విమర్శలు చేశారట.
ఆ సమయంలో ధైర్యం కోల్పోయిన తమన్నా.. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన సపోర్ట్‌తో ఈ స్థాయికి చేరుకున్నానని స్పష్టం చేసింది. అయితే తమన్నా గ్లామర్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముట్టుకుంటే మాసిపోయేలా ఉండే తమన్నా అందం ఇతర హీరోయిన్స్‌కి ఈర్ష్య కూడా తెప్పిస్తుంది.
ఎంత వయసు పెరుగుతున్నా సరే చెక్కు చెదరని తన అందాలతో కుర్రాళ్లకు హాట ట్రీట్ ఇస్తున్న తమన్నా పబ్లిక్ గా కనిపిస్తే ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళనాడులో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన తమన్నా అక్కడ తెగ సందడి చేసింది.
ఆమెని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహించారు. అయితే సెక్యూరిటీ అంతటిని దాటుకొని తమన్నా దగ్గరకు వెళ్లిన అభిమాని ఆమెతో సెల్ఫీ దిగాడు. ఆ సమయంలో తమన్నా కూల్‌గా హ్యాండిల్ చేసిన విధానం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. తమన్నా చేసిన పనిపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.