Tamilnadu
ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. పదేండ్ల కాలంలో 300 మంది రోగులను హత్య చేశాడు. ఈ విషయాన్ని ఆ వ్యక్తే స్వయంగా వెల్లడించాడు. దానికి సంబంధించిన ఓ వీడియో తమిళనాట(Tamilnadu) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు(Tamilnadu) నామక్కల్ జిల్లా పళ్లిపాలయానికి చెందిన మోహన్ రాజ్(34) స్థానిక సర్కార్ దవాఖానా వద్ద నిత్యం సంచరించేవాడు. అయితే అక్కడున్న మార్చురీ వద్ద తిరుగుతూ.. దాంట్లోని వర్కర్స్ చెప్పే పనులను చేస్తుంటాడు.
అయితే ఆ వ్యక్తి ఈ నెల 18వ తేదీన ఓ కీలక విషయాన్ని వెల్లడించాడు. తాను పదేండ్ల కాలంలో 300 మంది రోగులను హత్య చేసినట్లు మోహన్ రాజ్ వెల్లడించాడు. అతని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వయసు పైబడిన వారు, అనారోగ్యంతో బాధ పడుతున్న రోగులకు వారి కుటుంబ సభ్యులు, బంధువుల కోరిక మేరకు సూదితో విషపు మందు వేసి చేసినట్లు ఆ వ్యక్తి వీడియోలో పేర్కొన్నాడు. ఇలా ఒక్కరికి విషపు సూది ఇచ్చేందుకు రూ. 5 వేలు తీసుకున్నట్లు మోహన్ రాజ్ తెలిపాడు.
ఇప్పటి వరకు దాదాపు 300 మంది రోగులను చంపినట్లు స్పష్టం చేశాడు. రూ. 5 వేలు ఇస్తే రెండు నిమిషాల్లోనే పని పూర్తి చేస్తానని తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, మోహన్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.