Dahi | పెరుగుపై రాజుకున్న రగడ.. హిందీని రుద్దడంపై మండిపడ్డ తమిళనాడు

విధాత‌: Dahi | పెరుగు ప్యాకెట్లపై దహీ అని హిందీలో ముద్రించాలంటూ తమిళనాడు, కర్ణాటక పాల ఉత్పత్తి దారులకు కేంద్ర ఆహార ప్రమాణాల సంస్థ ఇచ్చిన ఆదేశాలపై తమిళనాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెరుగుతో పాటు నెయ్యి, వెన్న ప్యాకెట్లపై కూడా హిందీ పేర్లే ప్రముఖంగా ఉండాలని, కావాలంటే ప్రాంతీయ భాష పేర్లు బ్రాకెట్లలో పెట్టుకోవచ్చునని కేంద్ర సంస్థ ఆదేశించింది. The unabashed insistences of #HindiImposition have come to the extent of directing […]

  • Publish Date - March 30, 2023 / 01:30 PM IST

విధాత‌: Dahi | పెరుగు ప్యాకెట్లపై దహీ అని హిందీలో ముద్రించాలంటూ తమిళనాడు, కర్ణాటక పాల ఉత్పత్తి దారులకు కేంద్ర ఆహార ప్రమాణాల సంస్థ ఇచ్చిన ఆదేశాలపై తమిళనాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెరుగుతో పాటు నెయ్యి, వెన్న ప్యాకెట్లపై కూడా హిందీ పేర్లే ప్రముఖంగా ఉండాలని, కావాలంటే ప్రాంతీయ భాష పేర్లు బ్రాకెట్లలో పెట్టుకోవచ్చునని కేంద్ర సంస్థ ఆదేశించింది.

హిందీని మనపై రుద్దుతున్న పార్టీ (బీజేపీ)ని దక్షిణాది నుంచి పారదోలాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పిలుపునిచ్చారు. మన మాతృభాష పేర్ల వాడకుండా పెరుగును కూడా హిందీలో పెట్టాలనే స్థాయికి హిందీ రుద్దడం సాగుతున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

HIndi | మీ.. మీ.. భాష‌లను బ్రాకెట్‌లో పెట్టుకోండి.. దక్షిణాదిపై హిందీ పెత్తనం: కేంద్రం ఆదేశాలు జారీ

అయితే.. తాము పెరుగు ప్యాకెట్లపై దహీ అని ముద్రించబోమని తమిళనాడు పాల ఉత్పత్తి దారుల సంస్థ స్పష్టం. చేసింది. తమిళనాడు బీజేపీ విభాగం అధ్యక్షుడు అన్నమలాయి కూడా దహీ అని పెట్టాలనే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరారు.

గతంలో కేంద్ర విద్యా విధానం విషయంలో కూడా తమిళనాడులో ఆగ్రహం వ్యక్తమైంది. బీజేపీ మిత్రమైన అన్నా కూడా బీజేపీ డీఎంకే అధికారం ఉండి.. విధానాన్ని విమర్శించింది. 1960 దశకంలో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం పెల్లుబికింది.

Latest News