Assam | విధాత:ఎవరైనా టీచర్లు పాఠశాలకు పుస్తకాలతో వెళ్తారు. కానీ ఈ ప్రధానోపాధ్యాయుడు మాత్రం కొడవలితో వెళ్తున్నారు. కొడవలితో స్కూల్లో దర్శనమిస్తున్న హెడ్ మాస్టార్‌ను చూసి అటు టీచర్లు, ఇటు పిల్లలు భయంతో వణికి పోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అసోంలోని కాకర్ జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్లో ధృతిమేధ దాస్(38) హెడ్ మాస్టార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత 11 ఏండ్ల నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి దాస్ తన వెంట […]
Assam | విధాత:ఎవరైనా టీచర్లు పాఠశాలకు పుస్తకాలతో వెళ్తారు. కానీ ఈ ప్రధానోపాధ్యాయుడు మాత్రం కొడవలితో వెళ్తున్నారు. కొడవలితో స్కూల్లో దర్శనమిస్తున్న హెడ్ మాస్టార్‌ను చూసి అటు టీచర్లు, ఇటు పిల్లలు భయంతో వణికి పోతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. అసోంలోని కాకర్ జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్లో ధృతిమేధ దాస్(38) హెడ్ మాస్టార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత 11 ఏండ్ల నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి దాస్ తన వెంట కొడవలి తెచ్చుకుంటున్నాడు.
ఆ కొడవలిని చూసి టీచర్లు, పిల్లలు భయపడి పోతున్నారు. ఈ విషయం విద్యాశాఖ అధికారులకు, పోలీసులు తెలియడంతో పోలీసులు ఆ స్కూల్ వద్దకు చేరుకుని దాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
అయితే సహచర టీచర్లు సరిగా విధులు నిర్వర్తించడం లేదని, సమయానికి స్కూల్‌కు రావడం లేదని, ఈ నేపథ్యంలో వారిని భయపెట్టించేందుకు కొడవలితో పాఠశాలకు వస్తున్నట్లు దాస్ తెలిపాడు. ఆయన సమాధానం విని అధికారులు, పోలీసులు షాకయ్యారు. ప్రస్తుతం ఈ వార్త ట్రెండింగ్‌లో ఉంది.