8 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..!
విధాత: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు ప్రారంభమైన విషయం విదితమే. బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ(శాసనసభా వ్యవహారాల సంఘం) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ తేదీలపై చర్చించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రేపు చర్చించాలని నిర్ణయించారు. 5, 7వ తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 6న బడ్జెట్ ప్రవేశపెట్టి, […]

విధాత: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు ప్రారంభమైన విషయం విదితమే. బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు.
అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ(శాసనసభా వ్యవహారాల సంఘం) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ తేదీలపై చర్చించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రేపు చర్చించాలని నిర్ణయించారు.
5, 7వ తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 6న బడ్జెట్ ప్రవేశపెట్టి, 8వ తేదీన బడ్జెట్, పద్దులపై చర్చ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల కొనసాగింపుపై 8వ తేదీన మరోసారి బీఏసీ సమావేశం జరగనున్నట్లు సమాచారం.