TGOA | టీజీఓ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రంగం సిద్దం

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీఓ) నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నిక నిర్వ‌హ‌ణ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రిట‌ర్నింగ్ అధికారుల‌ను నియ‌మించింది

  • By: Somu    latest    Feb 09, 2024 10:46 AM IST
TGOA | టీజీఓ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రంగం సిద్దం
  • రిట‌ర్నింగ్ అధికారిగా డిప్యూటీ క‌లెక్ట‌ర్ ర‌వి నియామ‌కం


విధాత‌: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీఓ) నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నిక నిర్వ‌హ‌ణ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రిట‌ర్నింగ్ అధికారుల‌ను నియ‌మించింది. ఈ మేర‌కు రిట‌ర్నింగ్ అధికారిగా డిప్యూటీ క‌లెక్ట‌ర్, న‌ల్ల‌గొండ‌ ఆర్డీఓ ర‌వి, అసిస్టెంట్ రిట‌ర్నింగ్ అధికారిగా స‌రూర్ న‌గ‌ర్ డివిజ‌న్ క‌మ‌ర్షియ‌ల్ టాక్స్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ సి. సంప‌త్ కుమార్‌ల‌ను నియ‌మించింది.


ఈ మేర‌కు జీఏడి కార్య‌ద‌ర్శి నిర్మ‌ల ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఇద్ద‌రు అధికారులు టీజీఓ కార్య‌వ‌ర్గానికి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. ఈ మేర‌కు రిట‌ర్నింగ్ అధికారులు టీజీఓ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం రెండు రోజుల్లో పూర్తి కాగానే ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిసింది.