విధాత: తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం ఓటర్ల సంఖ్య 29,580,736గా ఉందని ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ గురువారం తెలిపారు. నవంబర్ 9న డ్రాఫ్ట్ స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్‌ఎస్‌ఆర్)ను ప్రచురించామన్నారు.
మొత్తం ఓటర్లలో పురుషులు 14,858,887 మంది ఉండగా, మహిళలు 14,702,391 మంది నమోదు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో థర్డ్ జెండర్ ఓటర్లు దాదాపు 1654 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు.
రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 34,891. ఇతరులు, ఎన్‌ఆర్‌ఐల వంటి ప్రత్యేక కేటగిరీలను మినహాయిస్తే, రాష్ట్రంలో మొత్తం సాధారణ ఓటర్ల సంఖ్య 29,562,932 అని సీఈవో తెలిపారు. 2737 మంది ఎన్నారై ఎలక్టోర్స్, 15,067 మంది సర్వీస్ ఎలక్టోర్స్ కూడా రిజిస్టర్ చేసుకున్నారని వికాస్ రాజ్ చెప్పారు.