GHMC | కాంగ్రెస్ జీహెచ్‌ఎంసీ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తత

GHMC విధాత, హైద్రాబాద్: జంటనగరాలలో వర్షాలు, వరద సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తు, వరద బాధితులకు పదివేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తు పీసీసీ చేపట్టిన జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ వద్ద ఉన్న గన్ పార్క్ వద్ద నుంచి గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం వరకు ప్రదర్శనగా సాగిన కాంగ్రెస్ శ్రేణులు జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముట్టడికి తరలివచ్చారు. వారిని కార్యాలయం వద్ధకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి […]

  • Publish Date - July 28, 2023 / 01:43 AM IST

GHMC

విధాత, హైద్రాబాద్: జంటనగరాలలో వర్షాలు, వరద సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తు, వరద బాధితులకు పదివేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తు పీసీసీ చేపట్టిన జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.

ఉదయం 11 గంటలకు అసెంబ్లీ వద్ద ఉన్న గన్ పార్క్ వద్ద నుంచి గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం వరకు ప్రదర్శనగా సాగిన కాంగ్రెస్ శ్రేణులు జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముట్టడికి తరలివచ్చారు. వారిని కార్యాలయం వద్ధకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసులతో కాంగ్రెస్ శ్రేణుల వాగ్వివాదం, తోపులాట సాగింది. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని ఈడ్చిపారేశారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావును, కార్పోరేటర్ విజయారెడ్డిని పోలీసులు కార్యాలయంలోనికి వెళ్లకుండా అడ్టుకున్నారు. అయితే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్‌ను కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు పోలీసులు లోనికి అనుమతించారు.

వారి వినతి పత్రాన్ని స్వీకరించేందుకు కమిషనర్ నిరాకరించడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నేతలు కార్యాలయంలోనే బైఠాయించి తమ నిరసన తెలిపారు. హైదరాబాద్ లో వరదలతో ప్రజలు అల్లాడుతుంటే కేసీఆర్, కేటీఆర్ లు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కమిషనర్ వైఖరీ అప్రజాస్వామికంగా ఉందంటు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, ఫిరోజ్‌ఖాన్ తదితరులు ఉన్నారు.

Latest News