Tesla EV Car | భారత్‌కు స్పెషల్‌గా EV కారును పరిచయం చేయనున్న టెస్లా..! కంపెనీ చరిత్రలోనే తక్కువ ధరకు..!

Tesla EV Car | భారత్‌లో టెస్లా ఎంట్రీ దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో మరో క్రేజీ వార్త ప్రచారంలోకి వచ్చింది. భారత్‌ కోసం ప్రత్యేకంగా టెస్లా ఓ ఎలక్ట్రిక్‌ కారును రూపొందిస్తున్నట్లు సమాచారం. టెస్లా చరిత్రలోనే అత్యంత చౌకైన కారుగా నిలువనున్నట్లు తెలుస్తున్నది. భారత్‌లో ఈవీ తయారీ ఫ్లాంట్‌ను స్థాపించాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన కంపెనీ భావిస్తున్నది. ఈ విషయంపై ఇటీవల టెస్లా బృందం కేంద్ర అధికారులతో సమావేశమైంది. మరోసారి ఈ నెలలో […]

Tesla EV Car | భారత్‌కు స్పెషల్‌గా EV కారును పరిచయం చేయనున్న టెస్లా..! కంపెనీ చరిత్రలోనే తక్కువ ధరకు..!

Tesla EV Car |

భారత్‌లో టెస్లా ఎంట్రీ దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో మరో క్రేజీ వార్త ప్రచారంలోకి వచ్చింది. భారత్‌ కోసం ప్రత్యేకంగా టెస్లా ఓ ఎలక్ట్రిక్‌ కారును రూపొందిస్తున్నట్లు సమాచారం. టెస్లా చరిత్రలోనే అత్యంత చౌకైన కారుగా నిలువనున్నట్లు తెలుస్తున్నది. భారత్‌లో ఈవీ తయారీ ఫ్లాంట్‌ను స్థాపించాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన కంపెనీ భావిస్తున్నది.

ఈ విషయంపై ఇటీవల టెస్లా బృందం కేంద్ర అధికారులతో సమావేశమైంది. మరోసారి ఈ నెలలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌లో భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ భేటీ తర్వాత టెస్లా ప్లాంట్‌ ఏర్పాటుకు కీలక అప్‌డేట్స్‌ సూచనలున్నాయి.

ఈ క్రమంలో భారత్‌లో కొత్త టెస్లా కారు రాబోతుందని ప్రచారం జరుగుతుంది. దీని ధర సుమారు24వేల డాలర్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. భారత కరెన్సీలో రూ.20లక్షలు. ఇప్పటి వరకు మోడల్‌ 3 సెడాన్‌ టెస్లాలో ఇప్పటి వరకు అత్యంత చౌకైన కారుగా కొనసాగుతున్నది. చైనాలో దీని ధర సుమారు భారత కరెన్సీలో రూ.26లక్షలు. భారత్‌లో 25శాతం తక్కువ ధరకు కొత్త కారును డిజైన్‌ చేయాలని టెస్లా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తున్నది.

భారత్‌లో ఈవీ కార్లకు ప్రస్తుతం డిమాండ్‌ పెరుగుతున్నది. ఈ క్రమంలో భారత్‌లోకి ప్రవేశించేందుకు ఎలాన్‌ మస్క్‌ కంపెనీ ఎదురుచూస్తున్నది. వాస్తవానికి చైనా నుంచి దిగుమతి చేయాలని భావించినా.. ఇందుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. తప్పనిసరిగా భారత్‌లోనే ప్లాంట్‌ను ఏర్పాటు చేసి.. ఇక్కడి నుంచి ఎగుమతి చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

అయితే, భారత్‌లో మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీ పెట్టాలని కేంద్రం డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ట్యాక్స్‌ లు తగ్గిస్తే ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని టెస్లా పేర్కొంటుంది. ఈ క్రమంలో టెస్లాకు మినహాయిం పులు ఉండవచ్చే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే, టెస్లాకు స్పెషల్‌గా ఏమీ మినహాయింపులు ఉండవని, అన్ని కంపెనీలను ఒకే విధంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.

ఇప్పుడున్న పాలసీలను మార్చబోయేది లేదని టెస్లాకు స్పష్టం చేశామని, అవసరమైతే పీఎల్​ఐ స్కీమ్​కు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ అధికారి తెలిపారు. టెస్లాకు బ్యాటరీలు సప్లై చేసే పానాసోనిక్​ సంస్థ సైతం తమను సంప్రదించిందని, ఇండియాలో బ్యాటరీలను తయారీని ప్రతిపాదిస్తే.. పీఎల్​ఐ స్కీమ్​కు దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్లు ఆ అధికారి వివరించారు.