Heart Attack | విధాత బ్యూరో, కరీంనగర్: రెండు వారాల వ్యవధిలో గుండెపోటుతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉమ్మెంతల మధుసూదన్ రెడ్డి (26), ఉమ్మెంతల శ్రీకాంత్ రెడ్డి(30) అన్నదమ్ములు. మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఈనెల 3న గుండెపోటుతో మృతి చెందారు.
కాగా.. తమ్ముని చిన్న కర్మ రోజునే అతని అన్న శ్రీకాంత్ రెడ్డి గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అవివాహితులైన ఇద్దరు అన్నదమ్ములు వారాల వ్యవధిలో మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తండ్రి ఉమ్మెంతల చంద్రారెడ్డి, కుటుంబసభ్యులు కుమారులను తలుచుకొని తల్లడిల్లి పోతున్నారు.