ABVP: TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
విధాత: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నదని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పోటీ పరీక్షలు నిర్వహించినా సజావుగా నిర్వహిస్తారనే నమ్మకం లేదని, అన్ని అవకతవకలే జరుగుతున్నాయని అన్నారు.

విధాత: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నదని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పోటీ పరీక్షలు నిర్వహించినా సజావుగా నిర్వహిస్తారనే నమ్మకం లేదని, అన్ని అవకతవకలే జరుగుతున్నాయని అన్నారు.