Navdeep | హీరో నవదీప్‌కు హైకోర్టులో చుక్కెదురు
Navdeep | 41-ఏ కింద నోటీసులు ఇవ్వండి.. పిటిషన్ కొట్టివేత విధాత, హైదరాబాద్: హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 41-ఏ కింద నోటీసులు ఇచ్చి, తర్వాత నవదీప్‌ను విచారించాలని పోలీసులను ఆదేశించింది. హీరో నవదీప్‌కు డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల సీపీ ఆనంద్ తెలిపిన విషయం తెలిసిందే. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ-1 భాస్కర్ బాలాజీ, ఏ-2 వెంకట రత్నారెడ్డి ఇచ్చిన సమాచారం […]

Navdeep |
- 41-ఏ కింద నోటీసులు ఇవ్వండి..
- పిటిషన్ కొట్టివేత
విధాత, హైదరాబాద్: హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 41-ఏ కింద నోటీసులు ఇచ్చి, తర్వాత నవదీప్‌ను విచారించాలని పోలీసులను ఆదేశించింది. హీరో నవదీప్‌కు డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల సీపీ ఆనంద్ తెలిపిన విషయం తెలిసిందే.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ-1 భాస్కర్ బాలాజీ, ఏ-2 వెంకట రత్నారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఏ-8 హీరో నవదీప్ మిత్రుడు రాంచందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, నవదీప్ పేరు తెరమీదకు వచ్చిందని, దీంతో హీరో నవదీప్‌కు డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నాయని వారు భావించారు. నవదీప్ తెలంగాణ హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. బుధవారం నవదీప్ తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. దీనిపై బుధవారం జస్టిస్ కే సురేందర్ ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో కూడా నవదీప్‌పై పలు రకాల డ్రగ్స్ కేసులు ఉన్నాయని నార్కోటిక్ పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసుతో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం పిటిషనర్ (నవదీప్) తరుఫు న్యాయవాది వెంటక సిద్ధార్థ వాదనలు వినిపిస్తూ.. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో అతను నిందితుడిగా లేడని న్యాయస్థానానికి వివరించారు. గతంలో నవదీప్ పై ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన దర్యాప్తు సంస్థల ఎదుట కూడా హాజరు అయ్యారని, అక్కడ పూర్తి వివరాలు కూడా సమర్పించారని తెలిపారు.
ప్రస్తుతం మాదాపూర్ డ్రగ్స్ కేసుతో కూడా ఆయనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలని అతన్ని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నవదీప్‌కు 41-ఏ కింద నోటీసులు సర్వ్ (ఇవ్వాలని) చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆతర్వాత అతన్ని విచారించాలని ఆదేశించింది. నవదీప్ పిటిషన్‌ను కొట్టివేసింది.