Rajasthan | ఇక్కడే రక్షణ లేదు.. మణిపూర్‌లో మహిళల గురించి మాట్లాడుతున్నాం: రాజ‌స్థాన్‌ కాంగ్రెస్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Rajasthan | విధాత‌: మ‌ణిపూర్‌లో జరుగున్న అల్ల‌ర్ల‌పై దేశ‌వ్యాప్తంగా నిరస‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రాష్ట్రాల్లోని త‌న కేడ‌ర్‌తో నిర‌స‌న గ‌ళం వెల్ల‌డిస్తోంది. ఈ నేప‌థ్యంలో రాజ‌స్థాన్ కు చెందిన కాంగ్రెస్ మంత్రి సంచ‌ల వ్యాఖ్య‌లు చేశారు. ఎక్కడో మణిపూర్‌లో ఉన్న మహిళల గురించి మాట్లాడుతున్నాం కానీ, ఇక్క‌డ మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచార‌ల‌ను త‌గ్గించ‌లేక పోతున్నామ‌న్నారు. మనం అధికారంలో ఉండి రాజస్థాన్‌లో ఉన్న మహిళలను కాపాడలేకపోతున్నామ‌ని మంత్రి రాజేంద్ర గుడ అసెంబ్లీలో […]

  • Publish Date - July 22, 2023 / 08:14 AM IST

Rajasthan |

విధాత‌: మ‌ణిపూర్‌లో జరుగున్న అల్ల‌ర్ల‌పై దేశ‌వ్యాప్తంగా నిరస‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రాష్ట్రాల్లోని త‌న కేడ‌ర్‌తో నిర‌స‌న గ‌ళం వెల్ల‌డిస్తోంది. ఈ నేప‌థ్యంలో రాజ‌స్థాన్ కు చెందిన కాంగ్రెస్ మంత్రి సంచ‌ల వ్యాఖ్య‌లు చేశారు.

ఎక్కడో మణిపూర్‌లో ఉన్న మహిళల గురించి మాట్లాడుతున్నాం కానీ, ఇక్క‌డ మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచార‌ల‌ను త‌గ్గించ‌లేక పోతున్నామ‌న్నారు.

మనం అధికారంలో ఉండి రాజస్థాన్‌లో ఉన్న మహిళలను కాపాడలేకపోతున్నామ‌ని మంత్రి రాజేంద్ర గుడ అసెంబ్లీలో వెల్ల‌డించారు.

అదేవిధంగా మన ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనేది మన మొహం మనం అద్దంలో చూసుకోవాలన్నారు. దీంతో వెంట‌నే కాంగ్రెస్ అధిష్టానం రాజేంద్ర గుడ‌ను మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించారు.

Latest News