MUNUGODE: అక్కడ ద్విముఖ పోరా.. త్రిముఖమా?
ఉన్నమాట: మునుగోడులో టీఆరెఎస్ బీజేపీల మధ్యే పోటీ ఉంటుందన్నది అందరూ అంటున్న మాట. అయితే మునుగోడు, చండూరు మండలాల్లోని ప్రజల అభిప్రాయం భిన్నంగా ఉన్నది. రాజగోపాల్ రెడ్డి నామినేషన్ రోజు వచ్చిన జనం కంటే పాల్వాయి సవంత్రి నామినేషన్ రోజు వచ్చిన జనమే ఎక్కువ అని అంటున్నారు. నేడు నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభం హుజూరాబాద్, దుబ్బాకలో ఓట్లు బదిలీ అయినట్టు ఇక్కడ కావు అంటున్నారు. రాజగోపాల్ కాంగ్రెస్‌ను వీడి కమలం తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయనతో […]

ఉన్నమాట: మునుగోడులో టీఆరెఎస్ బీజేపీల మధ్యే పోటీ ఉంటుందన్నది అందరూ అంటున్న మాట. అయితే మునుగోడు, చండూరు మండలాల్లోని ప్రజల అభిప్రాయం భిన్నంగా ఉన్నది. రాజగోపాల్ రెడ్డి నామినేషన్ రోజు వచ్చిన జనం కంటే పాల్వాయి సవంత్రి నామినేషన్ రోజు వచ్చిన జనమే ఎక్కువ అని అంటున్నారు.
హుజూరాబాద్, దుబ్బాకలో ఓట్లు బదిలీ అయినట్టు ఇక్కడ కావు అంటున్నారు. రాజగోపాల్ కాంగ్రెస్‌ను వీడి కమలం తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయనతో లీడర్లు వెళ్లారు కానీ క్యాడర్ మాత్రం పోలేదంటున్నారు. ఆ నియోజకవర్గం కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్‌కు వచ్చింది. 2014లో తప్పా 2018 లోనూ కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం వెనుక కాంగ్రెస్ క్యాడర్ గట్టిగా ఉండటం ఒక కారణం.
అలాగే ఇందిరమ్మ ఇండ్లు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, ఆయనతో ప్రజలకు ఉన్న సాన్నిహిత్యం ఉండటం వంటివి ఆ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచు కోటగా మారింది. గోవర్ధన్ రెడ్డి తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే అక్కడ కొంత పేరు ఉన్నది.
ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి కాంగ్రెస్ క్యాడర్‌తో పాటు జనాలకు కూడా నచ్చడం లేదు. అలాగే టీఆరెఎస్, బీజేపీలు ఓటర్లను ఆకట్టకునేందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నాయన్నా వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు ముఖ్యంగా మహిళలు స్రవంతి వైపు మొగ్గు చూపినా ఆశ్చర్య పోనక్కర్లేదు అంటున్నారు.
మునుగోడు: ప్రచారానికి రాజగోపాల్ రెడ్డి దూరం.. పేలుతున్న సెటైర్లు
రాజగోపాల్ రెడ్డికి పార్టీతో ఏమాత్రం ప్రయోజనం ఉన్నట్టు లేదు.. ఈ ఎన్నికల్లో వ్యక్తిగతంగా ఆయన ఒంటరి పోరాటమే తప్పా పూర్తి స్థాయిలో ఆయన వెంట వెళ్ళిన వాళ్ళు కూడా పనిచేయడం లేదని వినికిడి. అదేవిధంగా ఏడు మండలాల్లో మునుగోడు, చండూరులో కాంగ్రెస్ పట్టు కోల్పోలేదు.
అయితే ఇలా అనేక అంశాలను పరిశీలించిన తర్వాత అక్కడ ద్విముఖ పోరు కాదు త్రిముఖ పోటీ ఉంటుంది అని అర్థం అవుతున్నది. అదే నిజమయితే పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు చివరికి ఏమవుతుందో అన్న గుబులు గులాబీ నేతలను, కమలం నేతలను కలవర పరుస్తున్నది.