Banned Movies | బ్యాన్ చేయబడ్డ ఐదు బాలీవుడ్ చిత్రాలు.. ఇప్పుడు ఓటీటీలో! చూసేయండి మరి!
Banned Movies | ఒకప్పుడు సినిమాలపై ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోయేవి. కాని ఇటీవల చాలా సినిమాలు వివాదాలలో ఇరుక్కోవడం మనం చూస్తూనే ఉన్నాం. సెన్సార్ బోర్డు ఆ చిత్రానికి అనుమతి ఇచ్చినా.. కొందరు వ్యక్తులు తమ మనోభావాలు దెబ్బతీసే విషయాలు చిత్రంలో ఉన్నాయని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బ్యాన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ క్రమంలో గతంలో ఇండియాలో బ్యాన్ చేసిన ఐదు బాలీవుడ్ చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులు వాటిని చూసి […]

Banned Movies |
ఒకప్పుడు సినిమాలపై ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోయేవి. కాని ఇటీవల చాలా సినిమాలు వివాదాలలో ఇరుక్కోవడం మనం చూస్తూనే ఉన్నాం. సెన్సార్ బోర్డు ఆ చిత్రానికి అనుమతి ఇచ్చినా.. కొందరు వ్యక్తులు తమ మనోభావాలు దెబ్బతీసే విషయాలు చిత్రంలో ఉన్నాయని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బ్యాన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
అయితే ఈ క్రమంలో గతంలో ఇండియాలో బ్యాన్ చేసిన ఐదు బాలీవుడ్ చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులు వాటిని చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సినిమాలేంటంటే..
ముందుగా దీపా మెహతా దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఫైర్ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రశంసలు అందుకున్నప్పటికీ , దీనిని ప్రజలు వ్యతిరేఖించారు. హిందూ కుటుంబంలోని ఇద్దరు మహిళల మధ్య స్వలింగ సంపర్క సంబంధాన్ని ఇందులో చూపించగా దీనిపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూవీని నిషేదించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది.
ఇక 2015లో తెరకెక్కిన అన్‌ఫ్రీడమ్ అనే చిత్రాన్ని లెస్బియన్ లవర్స్ విత్ ఇస్లామిక్ టెర్రరిజం యాంగిల్లో రూపొందించారు. ఈ చిత్రం విడుదలైతే తీవ్రపరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో నిషేదించాల్సి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.
2010లో వచ్చిన గాండు అనే బెంగాలీ చిత్రంలో ఓరల్ సెక్స్ సీన్లు, నగ్న సన్నివేశాలు ఉండటంతో ఆ చిత్రాన్ని కూడా బ్యాన్ చేశారు.ఈ చిత్రం కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ఇక వివాదాస్పదంగా మారిన మరో బాలీవుడ్ చిత్రం బ్లాక్ ఫ్రైడే. ముంబై బాంబు పేళుళ్లపై తెరకెక్కిన ఈ చిత్ర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కగా, ఈ సినిమాపై కోర్టు కేసు ఉండటంతో రిలీజ్‌కి నోచు కోలేదు. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది.
ఇక వాటర్ అనే చిత్రం కూడా పలు వివాదాల వలన విడుదలకి నోచుకోలేదు. దీపా మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనురాగ్ కశ్యప్ కథ అందించగా, ఇందులో ఎక్కువగా వివాదాస్పద అంశాలు ఉండటంతో ఈ సినిమాను బ్యాన్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.
ఇదిలాఉండగా పాంచ్, సిన్స్, ది పింక్ మిర్రర్, ఉరఫ్ ప్రొఫెసర్, కామసూత్ర, బందిత్ క్వీన్, డాజెడ్ ఇన్ దూన్, ఇన్షఅల్లా ఫుట్ బాల్, ఫిరాఖ్ వంటి చిత్రాలు ఇప్పటికీ పూర్తిగా నిషేదానికి గురయ్యాయి.