Mancherial | మంచిర్యాలలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి

Mancherial | నిరసనకారుల తోపులాట.. అరెస్టు విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి వరద బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో ముట్టడికి శ్రేణులు తరలివచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకొనే క్రమంలో పోలీసులు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ […]

  • Publish Date - August 24, 2023 / 12:21 AM IST

Mancherial |

  • నిరసనకారుల తోపులాట.. అరెస్టు

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి వరద బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో ముట్టడికి శ్రేణులు తరలివచ్చారు.

అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకొనే క్రమంలో పోలీసులు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో గత మూడేళ్లుగా గోదావరి వరదలు వచ్చి రాం నగర్, ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసీ కాలనీ, పద్మశాలి నగర్, బాలాజీ నగర్ ఇళ్లలోకి వరద నీరు వచ్చి పెద్ద మొత్తంలో నష్టపోయరని తెలిపారు. బాధితులకు నష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఏటా వరదలు వచ్చి మంచిర్యాల పట్టణం ముంపు కు గురవుతున్నదని, కరకట్ట నిర్మించి ప్రజలను ముంపు నుంచి విముక్తి చేయాలని కోరారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలు గా పనిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల వైఖరి మార్చుకోవాలని పేర్కొన్నారు.