Train | రైలు కిటికీకి వేలాడిన దొంగ.. ఎందుకంటే?
Train | Viral Video | రైల్లో దొంగతనాలు తరుచుగా జరుగుతూనే ఉంటాయి. దొంగతనం చేశాక దొంగలు అక్కడ్నుంచి మెల్లగా జారుకుంటారు. కానీ ఓ దొంగ మాత్రం ప్రయాణికులకు దొరికిపోయాడు. రైలు కిటికీకి వేలాడుతున్న దొంగను ప్రయాణికులు పట్టుకుని ఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలోని కటిహార్ నుంచి సమస్తిపుర్‌కు రైలు బయల్దేరింది. ఈ రైల్లో ఎక్కిన దొంగ.. ఓ మహిళ పర్సును కాజేశాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించి, రైలు కిటికీని పట్టుకున్నాడు. […]
Train | Viral Video |
రైల్లో దొంగతనాలు తరుచుగా జరుగుతూనే ఉంటాయి. దొంగతనం చేశాక దొంగలు అక్కడ్నుంచి మెల్లగా జారుకుంటారు. కానీ ఓ దొంగ మాత్రం ప్రయాణికులకు దొరికిపోయాడు. రైలు కిటికీకి వేలాడుతున్న దొంగను ప్రయాణికులు పట్టుకుని ఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలోని కటిహార్ నుంచి సమస్తిపుర్‌కు రైలు బయల్దేరింది. ఈ రైల్లో ఎక్కిన దొంగ.. ఓ మహిళ పర్సును కాజేశాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించి, రైలు కిటికీని పట్టుకున్నాడు. గమనించిన ప్రయాణికులు.. దొంగ చేతులను, కాళ్లను గట్టిగా పట్టుకున్నారు.
తనను రక్షించండి అంటూ ఆ దొంగ అరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక బచ్వాడా జంక్షన్ రాగానే దొంగను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. దొంగ వద్ద ఉన్న పర్సును పోలీసులు రికవరీ చేసి, మహిళకు అప్పగించారు.
#बेगूसराय में चलती ट्रेन से लटका चोर
सोनपुर बरौनी रेलखंड के बछवाड़ा जंक्शन के समीप एक युवक को चोरी के शक में लोगों से बचने के लिए किमी तक ट्रेन की खिड़की से लटका रहा । इसके बाद बछवाड़ा जंक्शन पहुचने पर वहां लोगों ने उतारकर उसे आरपीएफ के हवाले कर दिया। #railway #viralvideo pic.twitter.com/aFgkWQktsQ
— Ghanshyam Dev (@Ghanshyamdev3) September 2, 2023
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram