Viral Video | గొప్ప పని కోసం దొంగతనం.. దొంగ మాటలకు పోలీసులు ఫిదా..
Viral Video | దొంగలు.. దొంగతనం ఎందుకు చేస్తారు? అందినకాడికి ఎందుకు దోచుకుంటారు? అంటే కష్టం తెలియకుండా సుఖంగా బతికేందుకు. లేదా విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు. కానీ ఈ దొంగ తన సొంత ప్రయోజనాల కోసం డబ్బులను దొంగిలించలేదు.. ఓ గొప్ప పని కోసం మాత్రమే. ఆ దొంగ మాటలను విన్న పోలీసులు ఓ వైపు నవ్వుతూనే ఫిదా అయిపోయారు. దొంగ, పోలీసులకు మధ్య జరిగిన సంభాషణ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని […]

Viral Video | దొంగలు.. దొంగతనం ఎందుకు చేస్తారు? అందినకాడికి ఎందుకు దోచుకుంటారు? అంటే కష్టం తెలియకుండా సుఖంగా బతికేందుకు. లేదా విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు. కానీ ఈ దొంగ తన సొంత ప్రయోజనాల కోసం డబ్బులను దొంగిలించలేదు.. ఓ గొప్ప పని కోసం మాత్రమే. ఆ దొంగ మాటలను విన్న పోలీసులు ఓ వైపు నవ్వుతూనే ఫిదా అయిపోయారు. దొంగ, పోలీసులకు మధ్య జరిగిన సంభాషణ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఓ యువకుడు రూ. 10 వేలు దొంగతనం చేశాడు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఎస్పీ అభిషేక్ పల్లవ అతన్ని విచారించాడు. అక్కడ చాలా మంది పోలీసులు కూడా ఉన్నారు. అయితే దొంగ చెప్పే సమాధానాలు విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. పగలబడి నవ్వారు. అంతే కాదు ఆ దొంగ గొప్ప మనసుకు ఫిదా అయిపోయారు.
సంభాషణ ఇది..
ఎస్పీ అభిషేక్ పల్లవ : దొంగతనం చేసిన తర్వాత నీవు ఎలా ఫీల్ అయ్యావు.
దొంగ : దొంగతనం చేయడం మంచిగానే అనిపించింది. కానీ తర్వాత పశ్చాత్తప పడ్డాను.
ఎస్పీ : తర్వాత ఎందుకు పశ్చాత్తప పడ్డావు.
దొంగ : నేను తప్పు చేశానని..
ఎస్పీ : ఎంత డబ్బు దొంగిలించావు.
దొంగ : 10 వేలు సర్
ఎస్పీ : మరి ఆ డబ్బు ఏం చేశావు.
దొంగ : పేదలకు పంచాను. ఎముకలు కొరికే చలిని తట్టుకోలేక ఫుట్‌పాత్‌లపై ఉంటున్న పేదలకు దొంగిలించిన డబ్బుతో బ్లాంకెట్స్ కొని అందజేశాను. ఇక కుక్కలు, ఆవులకు కూడా బ్లాంకెట్స్ ఏర్పాటు చేశాను.
ఎస్పీ : మరి నీకు తప్పక ఆశీర్వాదం అంది ఉంటుంది..
దొంగ : ఆశీర్వాదం అందుకున్నాను సర్..
दिलदार चोर