Triumph Scrambler Bike | సరికొత్త లగ్జరీ బైక్‌ను భారత్‌లో లాంచ్‌ చేసిన ట్రయంప్‌.. ధర ఎంతంటే..?

ప్రముఖ బ్రిటిష్‌ మోటార్‌ సైకిల్‌ కంపెనీ ట్రయంప్‌ భారత్‌లోకి కొత్తగా లగ్జరీ బైక్‌క్‌ను తీసుకువచ్చింది. ట్రయంఫ్​ స్క్రాంబ్లర్​ 1200 ఎక్స్​ బైక్‌ను లాంచ్‌ చేసింది

Triumph Scrambler Bike | సరికొత్త లగ్జరీ బైక్‌ను భారత్‌లో లాంచ్‌ చేసిన ట్రయంప్‌.. ధర ఎంతంటే..?

Triumph Scrambler Bike | ప్రముఖ బ్రిటిష్‌ మోటార్‌ సైకిల్‌ కంపెనీ ట్రయంప్‌ భారత్‌లోకి కొత్తగా లగ్జరీ బైక్‌క్‌ను తీసుకువచ్చింది. ట్రయంఫ్​ స్క్రాంబ్లర్​ 1200 ఎక్స్​ బైక్‌ను లాంచ్‌ చేసింది. ఈ బైక్‌ 1,200 సీసీ ప్యారలాల్​ ట్విన్​ ఇంజిన్​తో వస్తుంది. 90 హెచ్​పీ పవర్​ని, 110 ఎన్​ఎం టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. బైక్​లోని ట్యూబ్​లెస్​ టైర్స్​ కోసం సరికొత్త క్రాస్​ స్పోక్​డ్​ రిమ్స్​తో వస్తుంది. బైక్​ సీట్​ హైట్​ 820ఎంఎం కాగా.. దీన్ని 795 ఎంఎంకి తగ్గించుకునే అవకాశం సైతం ఉన్నది. రీయర్‌ ప్రీలోడ్​ అడ్జెస్ట్​మెంట్స్​ వస్తాయి. యాక్సియల్లీ మౌంటెడ్​ నిస్సిన్​ కాలిపర్స్​తో కూడిన బ్రేకింగ్​ సిస్టమ్‌ను కంపెనీ ఇచ్చింది. ట్రయంఫ్​ స్క్రాంబ్లర్​ 1200 ఎక్స్​లో రోడ్​, రెయిన్​, స్పోర్ట్​, ఆఫ్​ రోడ్​, రైడర్​ కాన్ఫిగరెబుల్​ అనే ఐదు రైడింగ్స్‌ ఉన్నాయి.


ఐఎంయూతో కూడిన ట్రాక్షన్​ కంట్రోల్​, ఏబీఎస్​ తదితర సేఫ్టీ ఫీచర్స్​ సైతం ఉన్నాయి. బైక్​లోని రౌండ్​ డాష్ ట్రయంఫ్​ 660 సీసీ బైక్స్​ని పోలి ఉంటుంది. టర్న్​ బై టర్న్​ నేవిగేషన్​, నోటిఫికేషన్​ అలర్ట్‌వి ఆప్షనల్‌గా కంపెనీ ఇస్తున్నది. స్క్రాంబ్లర్​ ఎక్స్​కి 70 అఫీషియల్​ యాక్సెసరీస్​ని సైతం ఇస్తున్నది. ఇక ఈ స్క్రాంబ్లర్​ 1200 ఎక్స్​ ఎక్స్​షోరూం ధర రూ.11.83 లక్షలు. స్క్రాంబ్లర్​ 1200 ఎక్స్​సీ కన్నా రూ.1.10 లక్షల ధర అధికంగా ఉన్నది. మంచి లగ్జరీ బైక్​ కొనాలని భావించే స్క్రాంబ్లర్​ 1200 ఎక్స్ కొత్త ఆప్షన్​ అవుతుందని మార్కెట్​ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బైక్‌ హార్లే-డేవిడ్‌సన్ ఐరన్ 883కి పోటీనిస్తుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.