Guntur Karam | నలిగిపోతున్న గురూజీ.. నలిపేస్తున్న మహేష్ జీ! ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే

Guntur Karam విధాత‌: ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందని ఊరికే అనలేదు. థమన్‌తో సినిమా చేస్తే ఒక కష్టం, చేయకుంటే మరో కష్టం. ఇలా ఇద్దరి మధ్య నలిగి పోతున్నాడట త్రివిక్రమ్. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాకు అన్నీ గండాలే ఎదురవుతున్నాయి. ఒకటి తప్పిందిలే అనుకుంటే మరొకటి అడ్డం పడి తెగ ఇరకాటంలో పడేస్తున్నాయి. మొన్నటి వరకూ మహేష్ అడ్డు చెప్పాడని హిరోయిన్ పూజా హెగ్డేను ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తే.. అమ్మడు త్రివిక్రమ్ […]

  • Publish Date - August 3, 2023 / 09:11 AM IST

Guntur Karam

విధాత‌: ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందని ఊరికే అనలేదు. థమన్‌తో సినిమా చేస్తే ఒక కష్టం, చేయకుంటే మరో కష్టం. ఇలా ఇద్దరి మధ్య నలిగి పోతున్నాడట త్రివిక్రమ్. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాకు అన్నీ గండాలే ఎదురవుతున్నాయి. ఒకటి తప్పిందిలే అనుకుంటే మరొకటి అడ్డం పడి తెగ ఇరకాటంలో పడేస్తున్నాయి.

మొన్నటి వరకూ మహేష్ అడ్డు చెప్పాడని హిరోయిన్ పూజా హెగ్డేను ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తే.. అమ్మడు త్రివిక్రమ్ మీద అలిగి కూచుందని తెగ బుజ్జగించాల్సి వచ్చింది. అది అయిపోయింది అనుకోగానే ఈ సినిమాకు అనుకున్న ఎడిటర్ కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం మరో అడ్డంకి, ఇప్పుడు ఏకంగా మ్యూజిక్ డైరెక్టర్నే మార్చేయమన్నాడట మహేష్.

ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం అని ముందు నుంచీ అనుకుంటున్నదే అయినా.. అతగాడి దంచు కొట్టుడు బాణీలు నచ్చకో ఏమో తమన్ పని చేయాల్సిన అవసరం లేదని రిజెక్ట్ చేశాడట మహేష్. ఈ మాట చెప్పేసి విదేశాలకు వెళ్లిపోయాడు.

కాస్త విరామం దొరికినా విదేశాల్లో రిఫ్రెష్ అయ్యి రావడం మహేష్‌కు ఉన్న అలవాటు. ఆయన పాటికి ఆయన చెప్పేసి వెళ్లిపోయాడు. అయితే ఇంతకు ముందు అల్లు అర్జున్‌తో చేసిన ‘అలవైకుంఠపురములో’ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన తమన్‌ని వదులుకోవడం అంటే గురూజీ వల్లే అయ్యే పనేనా?

అందుకే తమన్‌ని వదులుకోవడానికి మనసురాక త్రివిక్రమ్ పాత వర్క్ వదిలేసి కొత్త బాణీలను కట్టమని పురమాయించాడట. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు తమన్. రోజూ త్రివిక్రమ్, తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారు.

అయితే ఈమధ్యనే హాలీడే ట్రప్ నుంచి తిరిగి వచ్చిన మహేష్ కొత్త బాణీలను విని తమన్‌ను ఉంచుతాడా లేక త్రివిక్రమ్ మీద సీరియస్ అవుతాడా అనేది ఇంకా తెలియదు. ‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. మరి ఇలాంటి మలుపుల మధ్య ఎప్పటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి.

Latest News