BRS బాలేదు.. టీఆర్ఎస్ మంచిగుండే.. పేరుమార్పిడిపై ప్రజల పెదవి విరుపు.!
ఉన్నమాట: తెలంగాణ ప్రజలు తమ ఉనికిని, అస్థిత్వాన్ని వదులుకోవడానికి ఇష్ట పడడం లేదు. తెలంగాణ అనే సౌండ్, బ్రాండ్ ను కోల్పోయే పరిస్థితి వస్తే దాన్ని వ్యతిరేకించేందుకు కూడా తెలంగాణ సమాజం వెనుకాడదు. వాస్తవానికి తెలంగాణ ఆత్మగౌరవం పేరిట ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఏకంగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అనే పార్టీతో ప్రజల ముందుకు వెళ్లారు. కాగా.. ఆయన పొరట పటిమను, తెలంగాణ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని గౌరవించిన ప్రజలు ఆయన్ను […]

ఉన్నమాట: తెలంగాణ ప్రజలు తమ ఉనికిని, అస్థిత్వాన్ని వదులుకోవడానికి ఇష్ట పడడం లేదు. తెలంగాణ అనే సౌండ్, బ్రాండ్ ను కోల్పోయే పరిస్థితి వస్తే దాన్ని వ్యతిరేకించేందుకు కూడా తెలంగాణ సమాజం వెనుకాడదు. వాస్తవానికి తెలంగాణ ఆత్మగౌరవం పేరిట ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఏకంగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అనే పార్టీతో ప్రజల ముందుకు వెళ్లారు.
కాగా.. ఆయన పొరట పటిమను, తెలంగాణ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని గౌరవించిన ప్రజలు ఆయన్ను రెండు సార్లు ముఖ్యమంత్రిగా గెలుపించారు. అయితే ఆయన తాజాగా భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరిట జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఈ పేరు మార్పును ప్రజలు అంగీకరించడం లేదని ఓ సర్వేలో తేలిందట. కొత్త పార్టీ ఆమోదించడం లేదని తేలింది. బీఆర్ఎస్ అనే పార్టీ పేరును ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ? ఏమంటున్నారు అన్న అంశం మీద తెరాస పెద్దలు ఓ అంతర్గత సర్వే నిర్వహించారట. ఈ పేరు మార్పుపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. తెలంగాణ అనే పేరు ఎందుకు తొలగించడాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోవడం లేదని తేలింది.
తెలంగాణ అనే పేరు లేకుండా రాజకీయ పార్టీ ఏమిటన్న ప్రశ్న లేవనెత్తుతున్నారు. తెలంగాణ లేకపోతే టీఆర్ఎస్ ఎక్కడుంటుందని ప్రశ్నించారు. దీంతో ప్రజలను ఎలా ఒప్పించాలి.. వారి మద్దతు ఎలా పొందాలి అన్నదానిమీద మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. అలాగని ఇప్పటికే బీఆర్ఎస్ పేరిట జాతీయ పార్టీని ప్రకటించి ముందుకు సాగుతున్న తరుణంలో ఇప్పుడు దాన్ని మళ్ళీ దిద్దుకుని, తెలంగాణ కలిసి వచ్చేలా కొత్త పేరు పెట్టలేమని అంటున్నారు.
-RAGHAVA, ANANTHAPURAM