TS Minorities
విధాత, ఎన్నికలు సమీపిస్తున్న జనాకర్షక పథకాల్లో దూకుడు పెంచిన CM KCR ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనార్టీలకు పూర్తి సబ్సిడీతో లక్ష ఆర్ధిక సహాయం అందించాలని మరో కీలక నిర్ణయం తీసుకుని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా CM KCR కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదన్నారు.
అలాగే మైనార్టీల అభివృద్ధికి విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి చేస్తుందన్నారు. భిన్న సంస్కృతులను, విభిన్న మత ఆచార సాంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్ ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే వుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.