TTD | బీసీకి అనుకున్నారు.. కానీ భూమనకు ఇచ్చారు! టీటీడీ చైర్మన్‌గా తిరుపతి MLA

TTD విధాత‌: తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డికి అవకాశం దక్కింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 2006- 08 మధ్య ఒకసారి అయన దేవస్థానం చైర్మన్ గా పని చేసారు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్లకు ఆయనకు అదే పదవి దక్కడం గమనార్హం. ప్రస్తుత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండగా ఆయన్ను ఇప్పటికే విశాఖ , శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు.. పార్వతీపురం మన్యం జిల్లాల కోర్డినేటర్ గా జగన్ […]

TTD | బీసీకి అనుకున్నారు.. కానీ భూమనకు ఇచ్చారు! టీటీడీ చైర్మన్‌గా తిరుపతి MLA

TTD

విధాత‌: తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డికి అవకాశం దక్కింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 2006- 08 మధ్య ఒకసారి అయన దేవస్థానం చైర్మన్ గా పని చేసారు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్లకు ఆయనకు అదే పదవి దక్కడం గమనార్హం.

ప్రస్తుత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండగా ఆయన్ను ఇప్పటికే విశాఖ , శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు.. పార్వతీపురం మన్యం జిల్లాల కోర్డినేటర్ గా జగన్ నియమించడంతో అయన ఇప్పుడు రాజకీయాల్లో బాగా బిజీగా ఉంటున్నారు. దీంతో తిరుపతి దేవస్థానం పనుల్లో పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించ లేకపోతున్నారు.

దీంతో ఆయన్ను మార్చి భూమనకు అవకాశం ఇస్తున్నారు.గతంలో భూమన తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నపుడు కళ్యాణమస్తు పేరిట గ్రామాల్లో పేద దంపతుల పెళ్లిళ్లు చేయించి వారికీ అయ్యే ఖర్చు మొత్తం దేవస్థానం నిధులు భరించేలా ఓ కార్యక్రమం నిర్వహించే వారు. ఇది అప్పట్లో టీటీడీకి ఏంతో పేరు తెచ్చింది.

ఇక ఈ పదవికి గురజాల నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా జంగా కృష్ణమూర్తి అనే ఒక బీసీకి ఇస్తారని రూమర్స్ వచ్చినా మరి జగన్ ఆలోచన మాత్రం భూమన వైపే మొగ్గింది. దీంతో జంగా కృష్ణమూర్తి అసలు నిరాశలయ్యాయి.