Gujarat | గుజరాత్‌లో కూలిన రెండస్థుల భవనం.. నలుగురు సజీవ సమాధి
Gujarat అర్ధరాత్రి నిద్రలో ఉండగానే ఘటన మృతుల్లో ఇద్దరు బాలురు.. కొనసాగుతున్న సహాయ చర్యలు విధాత: గుజరాత్‌లోని జూనాగఢ్‌లో సోమవారం అర్ధరాత్రి రెండస్థుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్టు తెలుస్తున్నది. సహాయ, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 'సోమవారం రాత్రి 1.10 ప్రాంతంలో డిజాస్టర్ కంట్రోల్ రూమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. జునాగఢ్‌లోని దతార్ రోడ్డులో భవనం కూలిపోయినట్టు […]

Gujarat
- అర్ధరాత్రి నిద్రలో ఉండగానే ఘటన
- మృతుల్లో ఇద్దరు బాలురు..
- కొనసాగుతున్న సహాయ చర్యలు
విధాత: గుజరాత్‌లోని జూనాగఢ్‌లో సోమవారం అర్ధరాత్రి రెండస్థుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్టు తెలుస్తున్నది. సహాయ, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
‘సోమవారం రాత్రి 1.10 ప్రాంతంలో డిజాస్టర్ కంట్రోల్ రూమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. జునాగఢ్‌లోని దతార్ రోడ్డులో భవనం కూలిపోయినట్టు తెలిపారు. వెంటనే నేను ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, ఇతర సహాయ బృందాలను పంపించాను. యంత్రాలసాయంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు శిథిలాల నుంచి నాలుగు మృతదేహాలను వెలికి తీశారు.
#WATCH | Gujarat | A two-storeyed building collapsed in Junagadh. Several feared trapped. Further details awaited. pic.twitter.com/nxVeU0njSn
— ANI (@ANI) July 24, 2023
ఏడేండ్ల బాలుడు ఒకరు, 13-14 ఏండ్ల బాలుడు మరొకరు. మరో ఇద్దరు 35, 52 ఏండ్ల వయస్సు ఉన్న వారి మృతదేహాలను శిథిలాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సివిల్ హాస్పిటల్‌కు తరలించారు’ అని జునాగఢ్ కలెక్టర్ అనిల్ రణవసియ తెలిపారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జునాగఢ్‌లో పురాతన రెండు అంతస్థుల భవనం కుప్పకూలిన నేపథ్యంలో శిథిల భవనాలను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. వర్షాల నేపథ్యంలో పురాతన, శిథిల భవనాలను వెంటనే ప్రజలు ఖాళీ చేయాలని సూచించారు.