Piyush Goyal Meets Chandrababu: సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ!
అమరావతి : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ఏపీ పర్యటనకు వచ్చారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబునాయుడుతో పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. హెచ్ డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపు అంశాలపై కేంద్ర మంత్రితో చంద్రబాబు చర్చించారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందించారు.
భేటీలో దేశ, రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. చంద్రబాబుతో భేటీ అనంతరం పీయూష్ గోయల్ గుంటూరు టొబాకో బోర్డు సందర్శనకు వెళ్లారు. సోమవారం గోయల్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram