Subhash Reddy | టికెట్ ఎందుకివ్వలేదో చెప్పండి: సుభాష్ రెడ్డి

వారం రోజుల్లో నిర్ణయం ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి Subhash Reddy | విధాత: ‘ఉరి తీసే వారికి కూడా చివరి కోరిక అడుగుతారు. కానీ నాకు ఆ చాన్స్ కూడా ఇవ్వలేదు. నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పలేదు. వారం రోజుల్లో ఉప్పల్ టికెట్ పై పునరాలోచన చేయకుంటే ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా’ అని సీఎం కేసీఆర్ కు.. ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. మంగళవారం తన అనుచరులతో […]

  • By: Somu    latest    Aug 29, 2023 12:32 AM IST
Subhash Reddy | టికెట్ ఎందుకివ్వలేదో చెప్పండి: సుభాష్ రెడ్డి
  • వారం రోజుల్లో నిర్ణయం
  • ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి

Subhash Reddy | విధాత: ‘ఉరి తీసే వారికి కూడా చివరి కోరిక అడుగుతారు. కానీ నాకు ఆ చాన్స్ కూడా ఇవ్వలేదు. నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పలేదు. వారం రోజుల్లో ఉప్పల్ టికెట్ పై పునరాలోచన చేయకుంటే ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా’ అని సీఎం కేసీఆర్ కు.. ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. మంగళవారం తన అనుచరులతో సమావేశమైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2001 పార్టీ ఆవిర్భావం నుంచి ఉప్పల్ లో గులాబీ జెండా పట్టి కొనసాగుతున్నానని, పార్టీని, కార్యకర్తలను కాపాడానని అన్నారు.

2009లో టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేసినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు టికెట్ దక్కిన బండారి లక్ష్మారెడ్డికి 2014లో డిపాజిట్ కూడా రాలేదన్నారు. ‘ఎమ్మెల్యేలందరూ ఆస్తులు సంపాదిస్తే నేను ఉన్న ఆస్తులు అమ్ముకున్నా. గూండాలు, అన్యాయాలు చేసిన వారికి టికెట్ ఇచ్చారు. ఏ తప్పూ చేయని నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు’ అని నిలదీశారు. కరోనా ఇబ్బందిగా మారినా నియోజకవర్గంలో ఈ రెండేళ్లలో చాలా అభివృద్ధి పనులు చేశానన్నారు. ఈ సారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేయాలనుకున్నానని, కానీ కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడం నన్ను తీవ్ర నిరాశపరిచిందన్నారు.

మహేశ్వరం, ఎల్బీనగర్ లో కూడా కార్పొరేటర్లు ఓడిపోయారనీ, నా దగ్గర కేవలం నలుగురు మాత్రమే ఓడిపోయారనీ, కానీ నా దగ్గరే ఓడినట్లు ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నారని కేసీఆర్ కు భేటీ ప్రశ్నలు స్పందించారు. ఇప్పుడు టికెట్ ఇచ్చినాయన ఏనాడైనా పార్టీ జెండా మోసిండా అని ప్రశ్నించారు. ఆయన పార్టీకి, ప్రజలకు ఏం చేశారని, ఎందుకు టికెట్ ఇచ్చారో చెప్పాలన్నారు. కేవలం బీఎల్ఆర్ ట్రస్ట్ పేరిట మాత్రమే పనులు చేశారని, కాంగ్రెస్ జెండా పెట్టి డబ్బులు పంచిన వారికి టికెట్ ఎలా ఇచ్చారో కేసీఆర్ చెప్పాలన్నారు.

కాంగ్రెస్ నేత రాజిరెడ్డి ఫొటో పెట్టుకుని లక్ష్మారెడ్డి పనిచేసాడని, బీఆర్ఎస్ నేతల ఫొటోలను లక్ష్మారెడ్డి ఏ రోజూ పెట్టుకోలేదన్నారు. గ్రేటర్ లో 29 నియోజకవర్గాల్లో నా ఒక్కనికే ఎందుకు టికెట్ ఇవ్వలేదనీ ప్రశ్నించారు. వారం రోజులైనా సమాధానం లేదన్నారు. నాతో మాట్లాడటం లేదనీ, నన్ను ఎందుకు బలి చేశారో నాకు అర్థం కావడం లేదన్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలనీ, నా వెంట ఉన్నవారి పరిస్థితి ఏమిటి? అంటూ ఆవేదన వెలిబుచ్చారు. నా కుటుంబం మొత్తం ధర్నా చేద్దామని చెబితే వద్దని వారించానంటూ కేసీఆర్ తీరుపై ఆవేదనతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.