ఇదేం ఘోరం.. భార్య జాబ్ చేస్తుందని చితకబాదాడు..
Kerala | ప్రతి కుటుంబంలో ఆర్థిక కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల్లో భర్తకు భార్య తోడుగా నిలవాలనుకుంటుంది. తనకు చేతనైన పని చేసి.. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు భార్య ప్రయత్నిస్తుంది. అందుకోసం ఏదో ఒక పని వెతుక్కుంటుంది. భర్త కూడా తనకు తోడుగా నిలిచిందని సంతోషిస్తాడు. కానీ ఓ భర్త మాత్రం తన భార్య జాబ్ చేస్తుందని చితకబాదాడు. ఈ దారుణ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మల్యాన్ కీజూ పోలీసు […]

Kerala | ప్రతి కుటుంబంలో ఆర్థిక కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల్లో భర్తకు భార్య తోడుగా నిలవాలనుకుంటుంది. తనకు చేతనైన పని చేసి.. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు భార్య ప్రయత్నిస్తుంది. అందుకోసం ఏదో ఒక పని వెతుక్కుంటుంది. భర్త కూడా తనకు తోడుగా నిలిచిందని సంతోషిస్తాడు. కానీ ఓ భర్త మాత్రం తన భార్య జాబ్ చేస్తుందని చితకబాదాడు. ఈ దారుణ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మల్యాన్ కీజూ పోలీసు స్టేషన్ పరిధిలో దిలీప్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే ఆ కుటుంబం అప్పుల పాలైంది. తెచ్చిన అప్పులు తీర్చేందుకు దిలీప్ భార్య ఓ ఉద్యోగంలో చేరింది. ఆమె జాబ్ చేయడం దిలీప్ కు ఇష్టం లేదు. తన మాట వినకుండా పనికి వెళ్తున్న భార్యపై భర్త విరుచుకుపడ్డాడు. కర్రతో తీవ్రంగా చితకబాదాడు. ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. మళ్లీ ఇంకోసారి తన భార్య జాబ్ కు వెళ్లొద్దు అని, అందుకే కొట్టానని దిలీప్ పేర్కొన్నాడు.
తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాధితురాలు మల్యాన్ కీజూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు రిమాండ్ కు తరలించారు.