Viral News | నాకో మొగుడు కావాలి.. వెతికి పెడితే రూ. 4 లక్షల నజరానా..
Viral News | యుక్త వయసు వచ్చాక ప్రతీ యువతి తనకో భర్త కావాలని కోరుకుంటోంది. కొందరైతే తమకు నచ్చిన వ్యక్తులతో డేటింగ్ చేస్తూ కాలం గడిపేస్తుంటారు. సందర్భం వస్తే వారినే పెళ్లి కూడా చేసుకుంటారు. ఓ మహిళ కూడా ఐదేండ్ల పాటు పలువురితో డేటింగ్ చేసినా ఆమెకు ఎవరూ నచ్చలేదు. దీంతో చివరకు సోషల్ మీడియా మాధ్యమమైన టిక్ టాక్ వేదికగా ఒక ప్రకటన చేసింది. అదేంటంటే.. తనకో మొగుడు కావాలి. వెతికి పెట్టిన వారికి రూ. […]

Viral News |
యుక్త వయసు వచ్చాక ప్రతీ యువతి తనకో భర్త కావాలని కోరుకుంటోంది. కొందరైతే తమకు నచ్చిన వ్యక్తులతో డేటింగ్ చేస్తూ కాలం గడిపేస్తుంటారు. సందర్భం వస్తే వారినే పెళ్లి కూడా చేసుకుంటారు. ఓ మహిళ కూడా ఐదేండ్ల పాటు పలువురితో డేటింగ్ చేసినా ఆమెకు ఎవరూ నచ్చలేదు.
దీంతో చివరకు సోషల్ మీడియా మాధ్యమమైన టిక్ టాక్ వేదికగా ఒక ప్రకటన చేసింది. అదేంటంటే.. తనకో మొగుడు కావాలి. వెతికి పెట్టిన వారికి రూ. 4 లక్షల నజరానా ఇస్తానని ప్రకటించింది. మరి ఆ మహిళ గురించి తెలుసుకోవాలంటే లాస్ ఏంజెల్స్‌కు వెళ్లాల్సిందే.
లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఈవ్ టిల్లే కౌల్సన్ వయసు 35 ఏండ్లు. ఆమె కార్పొరేట్ లిటిగేషన్ అటార్నీగా పని చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇక ఒంటరిగా ఉన్న ఆమె ఐదేండ్ల పాటు పలువురితో డేటింగ్ చేసింది. ఆ జీవితంపై విరక్తి కలిగింది.
దీంతో తనకు ఓ భర్త కావాలని కోరుకుంది. తనకు పది లక్షల ఫాలోవర్లు ఉన్న టిక్ టాక్ వేదికగా.. కౌల్సన్ ప్రకటన చేసింది. తనకు భర్తను వెతికి పెట్టిన వారికి బహుమతిగా 5 వేల డాలర్లు(రూ. 4,10,462) ఇస్తానని ప్రకటించింది.
ఈ క్వాలిటీస్ మస్ట్
తనకు కాబోయే భర్త కచ్చితంగా 5 అడుగుల పైనే ఎత్తు ఉండాలి. 27 నుంచి 40 ఏండ్ల మధ్య వయసున్న వ్యక్తి మాత్రమే కావాలి. డ్రగ్స్ తీసుకోవద్దు. పిల్లలు, జంతువులను ప్రేమించాలి. ఆటలను ఇష్టపడాలి. అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి.
అయితే మీరు వెతికి పెట్టే భర్తతో కేవలం 20 సంవత్సరాలు మాత్రమే తన జీవితాన్ని కొనసాగిస్తాను. ఆ తర్వాత అతనికి విడాకులు ఇస్తాను. హీల్స్ ధరించొద్దని గతంలో డేటింగ్ చేసిన వ్యక్తులు నన్ను అడిగారు. కానీ అది నాకు ఇష్టం లేదు.
ఇక తనకు వివాహమైన తర్వాత రిజిస్ట్రేషన్ ఫైల్‌పై సంతకం చేసిన తర్వాత తనకు పెళ్లి సంబంధం చూసిన వ్యక్తికి తాను చెప్పిన విధంగానే నగదు బహుమతిని అందిస్తానని కౌల్సన్ ప్రకటించింది.