Uttam Kumar Reddy | తెలంగాణలో 70 సీట్లు గెలుస్తాం: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

ఆక్టోబర్‌ 6న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ Uttam Kumar Reddy | విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఆక్టోబర్‌ 6వ తేదిన విడుదల కాబోతుందని టీపీసీసీ మాజీ చీఫ్‌, ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో 70అసెంబ్లీ సీట్లను ఖచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ గెలువబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణలో బీజేపీ పోటీలోనే లేదన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ […]

  • Publish Date - August 19, 2023 / 12:41 AM IST
  • ఆక్టోబర్‌ 6న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌

Uttam Kumar Reddy | విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఆక్టోబర్‌ 6వ తేదిన విడుదల కాబోతుందని టీపీసీసీ మాజీ చీఫ్‌, ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో 70అసెంబ్లీ సీట్లను ఖచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ గెలువబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణలో బీజేపీ పోటీలోనే లేదన్నారు.

కాంగ్రెస్‌ టికెట్‌ ఆశావహులంతా ప్రజల్లో తిరుగాలన్నారు. బీఆరెస్‌ ప్రభుత్వం పై, ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను గమనించే సీఎం కేసీఆర్‌ ఇటీవల సంక్షేమ పథకాలు, వలసల పేరుతో హడావుడి చేస్తున్నారన్నారు