Veerasimha Reddy | బాలయ్య, మజాకానా.. ఏపీలోని ఆ థియేటర్‌లో 200 రోజులు పూర్తి చేసుకున్న వీరసింహారెడ్డి
Veerasimha Reddy: ప్రస్తుత రోజులల్లో ఓ సినిమా సరిగ్గా వారం ఆడడమే గగనం అయింది. ఒక సినిమా థియేటర్‌లోకి వచ్చి వారం కాకముందే ఆ స్థానంలో మరో సినిమా వచ్చేస్తుంది. దీంతో సినిమా నడిచిన ఆ నాలుగు రోజులే భారీగా దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో 50 రోజులు.. 100 రోజులు.. 150 రోజులు.. 175 రోజులు.. 200 రోజులు.. ఇలాంటి పోస్టర్స్ మనకు తరచు కనిపించేవి. కాని గత పదేళ్లుగా ఇలాంటివి కనిపించడమే లేదు. ఆ […]

Veerasimha Reddy: ప్రస్తుత రోజులల్లో ఓ సినిమా సరిగ్గా వారం ఆడడమే గగనం అయింది. ఒక సినిమా థియేటర్‌లోకి వచ్చి వారం కాకముందే ఆ స్థానంలో మరో సినిమా వచ్చేస్తుంది. దీంతో సినిమా నడిచిన ఆ నాలుగు రోజులే భారీగా దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో 50 రోజులు.. 100 రోజులు.. 150 రోజులు.. 175 రోజులు.. 200 రోజులు.. ఇలాంటి పోస్టర్స్ మనకు తరచు కనిపించేవి. కాని గత పదేళ్లుగా ఇలాంటివి కనిపించడమే లేదు. ఆ రోజుల్లో ఓ సినిమా హిట్ అంటే ఆ సినిమా ఇన్ని సెంటర్స్‌లో 100 రోజులు ఆడినట్టుగా చెప్పేవాళ్లు. కాని ఇప్పుడు పూర్తిగా మారింది. సినిమా హిట్ అంటే ఆ సినిమా ఫస్ట్ వీక్‌లో ఇన్ని వందల కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటున్నారు.
అయితే గతంలో పలుమార్లు రేర్ ఫేట్ సాధించిన బాలయ్య తాజాగా వీరసింహారెడ్డి చిత్రంతో మరో అరుదైన ఫీట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. వీరసింహారెడ్డి సినిమా 175 రోజుల దాటి.. 200 రోజులు పరుగును పూర్తి చేసుకుంది. జనవరి 12న వాల్తేరు వీరయ్య చిత్రానికి పోటీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఏప్రిల్ 21తో 100 రోజులను పూర్తి చేసుకుంది. ఇక జూలై 28తో 200 రోజుల పరుగును పూర్తి చేసుకుంది. కర్నూల్ అలూరిలోని ఎస్ఎల్ఎన్ఎస్ థియేటర్‌లో వీరసింహారెడ్డి చిత్రం ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ప్రస్తుతం వీరసింహారెడ్డి 200 రోజుల పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
వీరసింహారెడ్డి చిత్రం విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ హీరోగా, శృతి హాసన్, హానీరోజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. మాస్ యాక్షన్ అండ్ సెంటిమెంట్ సమపాళ్లలో కలగలిపిన చిత్రంగా రూపొందిన వీరసింహారెడ్డి అభిమానులను అలరించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా కలెక్షన్ల వర్షం కురిపించి, బాలయ్య కెరీర్ లో రెండోసారి 100 కోట్ల మార్క్ ను టచ్ చేసిన చిత్రంగా నిలిచింది.