VH | రాష్ట్రంలో ప్రతి రచ్చబండ దగ్గర రాహుల్‌గాంధీపై అనర్హతపై చర్చ: వీహెచ్
విధాత: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని అఖిలపక్ష సమావేశంలో నాయకులు ఖండించారు. తక్షణమే ఆయనపై అనర్హత వేటు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఏర్పాటు చేసిన రౌంట్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జన సమితి నాయకులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సీపీఐ మాజీ ఎంపీ అజీజ్ పాషా, అమ్ ఆద్మీ పార్టీ నేత రాము గౌడ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, […]

విధాత: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని అఖిలపక్ష సమావేశంలో నాయకులు ఖండించారు. తక్షణమే ఆయనపై అనర్హత వేటు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఏర్పాటు చేసిన రౌంట్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జన సమితి నాయకులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సీపీఐ మాజీ ఎంపీ అజీజ్ పాషా, అమ్ ఆద్మీ పార్టీ నేత రాము గౌడ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాజుల శ్రీనివాస్‌గౌడ్, మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ తదితర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి రచ్చబండ దగ్గర చర్చ జరుగుతున్నది. అరె పిలగాణ్ని తీసివేశారట. ఏం తప్పు చేశాడు? హత్య చేశాడా? ఇతర దేశాలకు డబ్బులు పంపాడా? ఇలాంటివి ఏమీ లేదు కదా! నా జీవితంలో ఇలాంటి చర్యలు ఎప్పుడూ చూడలేదని తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నదన్నారు.
మోడీ రాహుల్‌గాంధీని చూసి భయపడుతున్నారు. రాహుల్ గట్టిగా మాట్లాడే స్తోమత వచ్చిందన్నారు. మోడీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు.