Vijaya Shanthi | కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం మధ్యలోనే వచ్చేసిన విజయశాంతి.. అందుకేనట..?
Vijaya Shanthi | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా ఆ పార్టీ నాయకుల మధ్య ఉన్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. బండి సంజయ్ ఈటల రాజేందర్‌న్ టార్గెట్ చేసి ప్రసంగించగా, విజయశాంతి ప్రమాణస్వీకారం కార్యక్రమం మధ్యలోనే వచ్చేశారు. ఈ పరిణామాలపై అటు బీజేపీ నాయకుల్లో, ఇటు సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే కిషన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం ముగియక ముందే ఎందుకు అక్కడ్నుంచి వెళ్లిపోయారని విజయశాంతిని పలువురు మీడియా ప్రతినిధులు […]

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా ఆ పార్టీ నాయకుల మధ్య ఉన్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. బండి సంజయ్ ఈటల రాజేందర్‌న్ టార్గెట్ చేసి ప్రసంగించగా, విజయశాంతి ప్రమాణస్వీకారం కార్యక్రమం మధ్యలోనే వచ్చేశారు. ఈ పరిణామాలపై అటు బీజేపీ నాయకుల్లో, ఇటు సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది.
అయితే కిషన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం ముగియక ముందే ఎందుకు అక్కడ్నుంచి వెళ్లిపోయారని విజయశాంతిని పలువురు మీడియా ప్రతినిధులు ఆమె అడిగారు. దీనిపై విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. అది సరికాదు.. కిషన్ రెడ్డిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన తర్వాతనే బయటకు వచ్చానని స్పష్టం చేశారు.
అయితే నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అణిచి వేసేందుకు ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం అని ఆమె చెప్పుకొచ్చారు. ఆ పరిస్థితి వల్ల ముందుగానే సభ నుంచి వెళ్లాల్సి వచ్చిందన్నారు విజయశాంతి.
Live: BJP State Office, Nampally, Hyderabad. https://t.co/JYuP8YOCAS
— G Kishan Reddy (@kishanreddybjp) July 21, 2023
కిషన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రావడం విజయశాంతికి నచ్చలేదు. ఆయన వేదికపైకి వచ్చిన కాసేపటికే విజయశాంతి అక్కడ్నుంచి నిష్క్రమించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కిరణ్ కుమార్ రెడ్డిని నియమించింది.
ఇక బండి సంజయ్ మాట్లాడుతూ.. ఢిల్లీకి వెళ్లి అబద్దాలు చెప్పడం మానాలని, పార్టీ నమ్ముకున్న వారికి నష్టం కలిగించొద్దని పేర్కొన్నారు. తనపై తప్పుడు సమాచారం ఇచ్చారు. కానీ కిషన్ రెడ్డిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఆయన పార్టీ సిద్ధాంతం కోసం పని చేసే వ్యక్తి అని సంజయ్ ఆవేశంగా మాట్లాడారు. అయితే ఈటల రాజేందర్‌ను ఉద్దేశించే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారని, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.