ఎయిడ్స్ బాధితులకు.. ఓ ఊరు!

విధాత: సాటి మ‌నుషుల సుఖ‌సంతోషాల కోసం త‌మ జీవితాన్ని వెచ్చించ‌టం గొప్ప త్యాగం. నేటి ఆధునిక ప్ర‌పంచంలో వ్య‌క్తి ఎదుగుద‌లే ప్ర‌ధాన‌మై పోయింది. ఇలాంటి కాలంలో ప‌దిమంది మంచికోసం త‌న జీవితాన్ని అర్పించి సేవ‌చేస్తున్న వాడు ర‌వి బాప్ట్లే. మొద‌ట జ‌ర్న‌లిస్టుగా జీవితం ప్రారంభించాడు. వృత్తిలో భాగంగా ఎయిడ్స్ రోగుల క‌ష్టాలు, క‌న్నీళ్ల గురించ క‌థ‌నాలు రాశాడు. ఆ క్ర‌మంలోనే సంఘంలో హెచ్ఐవీ రోగులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, వివ‌క్ష చూసి చ‌లించి పోయి ఎయిడ్స్ రోగుల‌కే త‌న […]

  • By: krs    latest    Dec 02, 2022 11:13 AM IST
ఎయిడ్స్ బాధితులకు.. ఓ ఊరు!

విధాత: సాటి మ‌నుషుల సుఖ‌సంతోషాల కోసం త‌మ జీవితాన్ని వెచ్చించ‌టం గొప్ప త్యాగం. నేటి ఆధునిక ప్ర‌పంచంలో వ్య‌క్తి ఎదుగుద‌లే ప్ర‌ధాన‌మై పోయింది. ఇలాంటి కాలంలో ప‌దిమంది మంచికోసం త‌న జీవితాన్ని అర్పించి సేవ‌చేస్తున్న వాడు ర‌వి బాప్ట్లే. మొద‌ట జ‌ర్న‌లిస్టుగా జీవితం ప్రారంభించాడు.

వృత్తిలో భాగంగా ఎయిడ్స్ రోగుల క‌ష్టాలు, క‌న్నీళ్ల గురించ క‌థ‌నాలు రాశాడు. ఆ క్ర‌మంలోనే సంఘంలో హెచ్ఐవీ రోగులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, వివ‌క్ష చూసి చ‌లించి పోయి ఎయిడ్స్ రోగుల‌కే త‌న జీవితాన్ని అంకితం చేయాల‌నుకున్నాడు. 2007లో ఉద్యోగాన్ని వ‌దిలి పెట్టి హెచ్ఐవీ బాధితుల సంర‌క్ష‌ణ కోసం ప‌నిచేయ‌టం ప్రారంభించాడు.

ముఖ్యంగా ఎయిడ్స్ బాధితులైన త‌ల్లిదండ్రుల పిల్ల‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌లు అన్నీ ఇన్నీ కావు. మొద‌ట ఎయిడ్స్ బాధిత పిల్ల‌ల‌ను చేర దీసి వారి సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ను చేప‌ట్టాడు. వారి కోసం ఏకంగా ఇండ్ల‌ను నిర్మించాడు. దాన్నే ఆయ‌న హాపీ ఇండియ‌న్ విలేజ్‌గా పిలుస్తున్నాడు. వారికి అవ‌స‌ర‌మైన మందుల‌ను స‌కాలంలో అందిస్తూ, స‌రైన పోష‌కాల‌తో ఆహారాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు ఆ విలేజ్‌లో 85మంది ఆశ్ర‌యం పొందుతున్నారు. ర‌వి సేవాత‌త్ప‌ర‌త‌ను చూసిన ఓ పెద్దాయ‌న 60 ఎక‌రాల భూమిని దానం చేశాడు.

ప్ర‌పంచంలోనే ఎయిడ్స్ బాధిత దేశాల్లో మ‌న దేశం మూడ‌వ స్థానంలో ఉన్న‌ది. దేశంలో మొత్తం హెచ్ఐవీ బాధితులు 21 ల‌క్ష‌ల మంది ఉన్న‌ట్లు నేష‌న‌ల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ తెలిపింది. అందులో ఏడు శాతం అంటే.. 1.45ల‌క్ష‌ల మంది 15 ఏండ్ల‌లోపు పిల్ల‌లున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఏదేమైనా.. స‌మాజం చేత నిరాద‌ర‌ణ‌కు వివ‌క్ష‌కు గుర‌వుతున్న ఎయిడ్స్ బాధితుల సంర‌క్ష‌ణ కోసం జీవితాన్ని వెచ్చించి కృషి చేస్తున్న ర‌వి బాప్ట్లె కు హ్యాట్సాప్‌.