Viral Video | మొస‌లికి ముచ్చెట‌మ‌లు ప‌ట్టించిన త‌ల్లి ఏనుగు

Viral Video | త‌న బిడ్డ ప్రాణానికి ప్ర‌మాదం పొంచి ఉంటే ఏ త‌ల్లి కూడా నిర్ల‌క్ష్యం వ‌హించ‌దు. ఏదో ఒక ర‌కంగా త‌న బిడ్డ ప్రాణాల‌ను కాపాడుకునేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తుంది. ఓ ఏనుగు కూడా త‌న పిల్ల ఏనుగును కాపాడుకునేందుకు మొస‌లితో ఫైటింగ్ చేసింది. ఓ అడ‌విలో ఏనుగు త‌న పిల్ల ఏనుగును తీసుకొని ఓ నీటి కొల‌ను వ‌ద్ద‌కు వెళ్లింది. ఆ కొల‌నులో మొస‌లి ఉన్న విష‌యాన్ని ఏనుగు మొద‌ట్లో గ్ర‌హించ‌లేదు. ఇక పిల్ల […]

Viral Video | మొస‌లికి ముచ్చెట‌మ‌లు ప‌ట్టించిన త‌ల్లి ఏనుగు

Viral Video | త‌న బిడ్డ ప్రాణానికి ప్ర‌మాదం పొంచి ఉంటే ఏ త‌ల్లి కూడా నిర్ల‌క్ష్యం వ‌హించ‌దు. ఏదో ఒక ర‌కంగా త‌న బిడ్డ ప్రాణాల‌ను కాపాడుకునేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తుంది. ఓ ఏనుగు కూడా త‌న పిల్ల ఏనుగును కాపాడుకునేందుకు మొస‌లితో ఫైటింగ్ చేసింది.

ఓ అడ‌విలో ఏనుగు త‌న పిల్ల ఏనుగును తీసుకొని ఓ నీటి కొల‌ను వ‌ద్ద‌కు వెళ్లింది. ఆ కొల‌నులో మొస‌లి ఉన్న విష‌యాన్ని ఏనుగు మొద‌ట్లో గ్ర‌హించ‌లేదు. ఇక పిల్ల ఏనుగు నీటిలో దిగి సేద తీరుతుండ‌గా.. త‌ల్లి ఏనుగు కూడా అక్క‌డే నిల‌బ‌డిపోయింది. క్ష‌ణాల్లోనే మొస‌లి పిల్ల ఏనుగుపై దాడి చేసేందుకు య‌త్నించింది.

Langurs | ఆ కొండముచ్చులు.. గుండెలు పిండేశాయి

గ్ర‌హించిన త‌ల్లి ఏనుగు మొస‌లికి ముచ్చెట‌మ‌లు ప‌ట్టించింది. కాళ్ల‌తో తొక్కి ప‌డేసేందుకు య‌త్నించింది ఏనుగు. దీంతో తేరుకున్న మొస‌లి నీటిలో నుంచి గ‌బ‌గ‌బ బ‌య‌ట‌కు వ‌చ్చి అక్క‌డే ఉన్న చెట్ల పొద‌ల్లోకి వెళ్లి దాచుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే