Virat Kohli | ఏడాదంతా క్రికెట్ ఆడితే రూ.7 కోట్లు.. అదే ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కి రూ.రూ.11.45 కోట్లు

Virat Kohli | మ‌న ఇండియాలో క్రికెట‌ర్స్‌కి ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టీమిండియాలో ధోని త‌ర్వాత మ‌ళ్లీ అంత క్రేజ్ ద‌క్కించుకున్న క్రికెట‌ర్ ఎవ‌రంటే విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు. కోహ్లీ గ్రౌండ్‌లో ఉంటే ఆ సంద‌డి వేరే లెవ‌ల్‌. అత‌ను కెప్టెన్సీ నుండి త‌ప్పుకున్నా, ఇటీవ‌ల ఫామ్ కోల్పోయిన కూడా అతని క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. సక్సెస్ ఫుల్ క్రికెట‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీకి క్రికెట్ ఆడితే వచ్చే […]

  • Publish Date - August 11, 2023 / 11:55 AM IST

Virat Kohli |

మ‌న ఇండియాలో క్రికెట‌ర్స్‌కి ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టీమిండియాలో ధోని త‌ర్వాత మ‌ళ్లీ అంత క్రేజ్ ద‌క్కించుకున్న క్రికెట‌ర్ ఎవ‌రంటే విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు. కోహ్లీ గ్రౌండ్‌లో ఉంటే ఆ సంద‌డి వేరే లెవ‌ల్‌. అత‌ను కెప్టెన్సీ నుండి త‌ప్పుకున్నా, ఇటీవ‌ల ఫామ్ కోల్పోయిన కూడా అతని క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు.

సక్సెస్ ఫుల్ క్రికెట‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీకి క్రికెట్ ఆడితే వచ్చే ఆదాయం క‌న్నా కూడా ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్ ద్వారా వ‌చ్చే ఆదాయం ఎక్కువ‌. ఇప్పుడు కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 256 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇత‌ర మాధ్య‌మాలు అయిన ఫేస్‌బుక్‌లో 50, ట్విట్టర్‌లో 51 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

విరాట్ కోహ్లీకి కేవ‌లం ఇండియాలోనే కాదు ఆసియా ఖండంలోనే మోస్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్నా డు. ఇన్‌స్టాలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ ఉన్న స్పోర్ట్స్ సెలబ్రిటిల్లో వరల్డ్‌లోనే టాప్ 3లో నిలిచాడు విరాట్ కోహ్లీ. అత‌నికి ఒక్కో ఇన్‌స్టా పోస్ట్ ద్వారా రూ.11.45 కోట్ల ఆదాయం ల‌భిస్తుంది.

అయితే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో విరాట్ కోహ్లీకి A+ కేటగిరిలో చోటు ద‌క్క‌గా, అత‌నికి ఏడాదికి గాను బీసీసీఐ నుంచి రూ.7 కోట్లు అందుతుంది. అదే ఒక్క ఇన్‌స్టా పోస్ట్ ద్వారా రూ.11.45 కోట్లు ఆదాయం వ‌స్తుంది.

ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన‌ క్రిస్టియానో రొనాల్డో.. ఒక్క‌ ఇన్‌స్టా పోస్ట్ ద్వారా రూ.26.7 కోట్లు రాబ‌డుతుంటే, అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రూ.21.5 కోట్లు ఆర్జిస్తున్నారు.వారిద్ద‌రి త‌ర్వాత ఇన్‌స్టా ద్వారా అత్యధిక మొత్తం రాబ‌డుతున్న‌ మూడో స్పోర్ట్స్ సెలబ్రిటీ విరాట్ కోహ్లీ కావ‌డం విశేషం.

ఇక కోహ్లీ టెస్ట్ మ్యాచ్ ఆడితే రూ. 15 ల‌క్ష‌లు వ‌స్తుంది. అదే వ‌న్డే మ్యాచ్ ఒక‌టి ఆడితే రూ.6 లక్షలు, ఒక్కో టీ20 మ్యాచ్ ద్వారా రూ.3 లక్షలు ద‌క్కుతుంది. ఇక ఐపీఎల్‌లో ఆర్‌సీబీ నుంచి రూ.16 కోట్లు అందుకుంటున్నాడు విరాట్ కోహ్లీ.. మ‌రోవైపు అత‌నికి ట్విట్ట‌ర్‌లో కూడా విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉండ‌గా, ఒక్క పోస్ట్‌కి రూ.3 కోట్లు వ‌ర‌కు అందుకుంటాడు.

వివో, మింత్రా, ఉబర్, ఎంఆర్‌ఎఫ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి డజనుకి పైగా బ్రాండ్స్‌కి అంబాసిడ‌ర్‌గా ఉన్న కోహ్లీ వాటి ద్వారా కూడా బాగానే సంపాదిస్తాడు. స్టార్ట‌ప్స్‌లో కూడా ఆయ‌న కొన్ని పెట్టుబ‌డులు పెట్టారు. క్రికెట్‌తో క్రేజ్ అందుకున్న కోహ్లీ ప‌లు ర‌కాలుగా కోట్ల‌కు కోట్లు సంపాదిస్తుండ‌డం చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.