రాజగోపాల్‌ వ్యాఖ్యలు: టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య వార్‌ తీవ్రం!

విధాత: ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ తాంత్రికుడు చెప్పిన ప్రకారం చేస్తున్నారని బండి సంజయ్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణలు తిరిగి వాళ్లకే బూమ్ రాంగ్ అయ్యాయి. ప్రధాని మోడీ, నిర్మలా సీతారామన్ సహా బీజేపీ నేతలు స్వాముల దగ్గర మోకరిల్లిన ఫొటోలతో టీఆర్‌ఎస్ శ్రేణులు ట్రోల్ చేస్తున్నారు. అసలు ఉన్నపళంగా వాళ్ళు కేసీఆర్‌పై క్షుద్ర పూజలు, తాంత్రికుడు చెప్పినట్టు చేస్తున్నాడని ఎందుకు అన్నారు? అనే దానికి కౌంటర్ ఇస్తున్నారు. మునుగోడు అభివృద్ధి కోసమే తాను […]

  • By: krs    latest    Oct 08, 2022 5:43 PM IST
రాజగోపాల్‌ వ్యాఖ్యలు: టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య వార్‌ తీవ్రం!

విధాత: ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ తాంత్రికుడు చెప్పిన ప్రకారం చేస్తున్నారని బండి సంజయ్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణలు తిరిగి వాళ్లకే బూమ్ రాంగ్ అయ్యాయి. ప్రధాని మోడీ, నిర్మలా సీతారామన్ సహా బీజేపీ నేతలు స్వాముల దగ్గర మోకరిల్లిన ఫొటోలతో టీఆర్‌ఎస్ శ్రేణులు ట్రోల్ చేస్తున్నారు.

అసలు ఉన్నపళంగా వాళ్ళు కేసీఆర్‌పై క్షుద్ర పూజలు, తాంత్రికుడు చెప్పినట్టు చేస్తున్నాడని ఎందుకు అన్నారు? అనే దానికి కౌంటర్ ఇస్తున్నారు. మునుగోడు అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశాను, పదవి ని త్యాగం చేశానని ఇంతకాలం చెబుతున్న రాజగోపాల్ రెడ్డి నిన్న ఓ టీవీ చానల్‌లో 6 నెలల కిందట తనకు రూ.18 వేల కాంట్రాక్టు వచ్చిందని అంగీకరించారు.

కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్ కాషాయతీర్థం పుచ్చకున్నారని రేవంత్ రెడ్డి మొదలు టీఆర్‌ఎస్ మంత్రులు, ప్రజాప్రతినిధుల దాకా ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు ఈ ఆరోపణలపై వివిధ సర్వేలు అక్కడి ప్రజలను అడిగితే దాదాపు 70 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. వీటన్నింటికి రాజగోపాల్ వ్యాఖ్యలు బలం చేకూర్చాయి అనే చర్చ జరుగుతున్నది.

దీంతో మునుగోడులోనే కాదు రాష్ట్రంలో బీజేపీకి ఆయన కామెంట్స్ డ్యామేజ్ చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే నష్ట నివారణలో భాగంగా సంజయ్ మొదలు నిర్మలా సీతారామన్ దాకా ఆ ఇష్యూ ను పక్కదోవ పట్టించడానికి సీఎంపై ఆరోపణలు చేశారని అంటున్నారు. మొత్తానికి రాజగోపాల్ ఎరక్కపోయి ఇరుక్కోవడమే కాకుండా మొత్తం బీజేపీ నాయకత్వాన్ని ఈ వివాదంలోకి లాగారని మునుగోడు ప్రజలు చర్చించుకుంటున్నాన అంట.