Warangal | పారిపోయిన నాయకులకు ఓటు అడిగే హక్కు లేదు: ఎమ్మెల్యే పెద్ది

Warangal ప్రతిపక్షాలది ఓట్ల రాజకీయం నాది అభివృద్ధి, సంక్షేమ రాజకీయం చేరికల సభలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజలను వదిలి, ప్రజా సమస్యల పరిష్కారం పట్టించుకోకుండా పారిపోయిన నాయకులు మళ్ళీ కొత్త వేషాలతో వస్తున్నారని, విపక్ష నాయకులపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విరుచుకపడ్డారు. ఇలాంటి నాయకులకు తిరిగి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా దుగ్గొండిలో శుక్రవారం భారీ స్థాయిలో జరిగిన చేరికల కార్యక్రమం […]

Warangal | పారిపోయిన నాయకులకు ఓటు అడిగే హక్కు లేదు: ఎమ్మెల్యే పెద్ది

Warangal

  • ప్రతిపక్షాలది ఓట్ల రాజకీయం
  • నాది అభివృద్ధి, సంక్షేమ రాజకీయం
  • చేరికల సభలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజలను వదిలి, ప్రజా సమస్యల పరిష్కారం పట్టించుకోకుండా పారిపోయిన నాయకులు మళ్ళీ కొత్త వేషాలతో వస్తున్నారని, విపక్ష నాయకులపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విరుచుకపడ్డారు.

ఇలాంటి నాయకులకు తిరిగి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా దుగ్గొండిలో శుక్రవారం భారీ స్థాయిలో జరిగిన చేరికల కార్యక్రమం సభ జరిగింది. వంగేటి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి భారీగా చేరికలు జరిగాయి.

దుగ్గొండి మండలంలోని మహమ్మదాపురం, మర్రిపల్లి, నాచినపల్లి, మందపల్లి, దుగ్గొండి, దేశాయిపల్లి, రేబల్లె, మైసoపల్లి, చలపర్తి గ్రామాల నుండి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ,బిజెపిని వీడి బిఆర్ఎస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగించారు.

ప్రతిపక్షాలది ఓట్ల రాజకీయమైతే నాది అభివృద్ధి, సంక్షేమ రాజకీయం, నాకు మీరిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం శిరస్సు వంచి 24 గంటలు బాధ్యతగా పనిచేస్తున్నానని వివరించారు.

నియోజకవర్గ ప్రజల 70 ఏళ్ల సాగునీటి కలను నిజం చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీదన్నారు. ప్రజలు ఇచ్చిన ఒక్క అవకాశంతో చరిత్రలో నిలబడే అభివృద్ధిని చేసి చూపించామని చెప్పారు.
రాజకీయాలకతీతంగా నిత్యం ప్రజా సంక్షేమంలో, రైతు సేవలో ఉన్నానని వివరించారు.

విజన్, విలువలు లేని వారితో అభివృద్ధి జరగదు.. రాజకీయ చైతన్యo ఉన్న నర్సంపేట ప్రజలు పగటి వేషగాళ్లను నమ్మరనే విశ్వాసం వ్యక్తంచేశారు. విద్యా, వైద్యం, సంక్షేమం, సాగునీటి రంగంలో నియోజకవర్గన్ని అభివృద్ధి పథంలో నిలిపానని చెప్పారు.

నాకు రాజకీయంగా అండగ ఉన్న నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధితో రుణం తీర్చుకుంటానన్నారు. నాయకులను కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధితో ప్రజలు తలెత్తుకునేలా చేసానని, గత పాలకుల కంటే మెరుగ్గా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు.

మరోసారి గెలుపు గులాబీ పార్టీ దేనని మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేస్తారనే నమ్మకం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు, ఎంపీపీ, తదితరులు పాల్గొన్నారు.