Warangal | KUC ఇన్స్పెక్టర్ దయాకర్ సస్పెండ్
Warangal భూవివాదంలో కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ పోలీస్ కమీషనర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కె.యూ.సి ఇన్‌స్పెక్టర్ దయాకర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ వివాదంలో కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహారించారనే ఆరోపణలు ఉన్నాయి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోగా భాదితులను పలుమార్లు స్టేషన్ కు తిప్పిస్తూ తన ప్రోత్సాహంతో బయటి వ్యక్తులతో సెటిల్మెంట్‌కు […]

Warangal
- భూవివాదంలో కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం
- ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ పోలీస్ కమీషనర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కె.యూ.సి ఇన్‌స్పెక్టర్ దయాకర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ వివాదంలో కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహారించారనే ఆరోపణలు ఉన్నాయి.
బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోగా భాదితులను పలుమార్లు స్టేషన్ కు తిప్పిస్తూ తన ప్రోత్సాహంతో బయటి వ్యక్తులతో సెటిల్మెంట్‌కు ప్రయత్నిస్తున్నందుకు ఇన్స్పెక్టర్ దయాకర్ ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు.
రంగనాథ్ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి పలువురు సిఐలు, ఎస్ఐలు, కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆ జాబితాలో ప్రస్తుతం దయాకర్ జత కూడారు.