Warangal | మాదన్నపేట చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

Warangal విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గత కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా నిండుకుండలా మారిన నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు కట్టను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి , రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. రెవెన్యూ, పోలీస్, వైద్య బృందం నిత్య పర్యవేక్షణ చేయాలని, ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అనంతరం మాదన్నపేట చెరువు కట్టపై ఉన్న మైసమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. కట్ట […]

  • By: krs    latest    Jul 27, 2023 1:53 AM IST
Warangal | మాదన్నపేట చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

Warangal

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గత కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా నిండుకుండలా మారిన నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు కట్టను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి , రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. రెవెన్యూ, పోలీస్, వైద్య బృందం నిత్య పర్యవేక్షణ చేయాలని, ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అనంతరం మాదన్నపేట చెరువు కట్టపై ఉన్న మైసమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. కట్ట భధ్రతను పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట ఆర్డీవో, తహశీల్దార్, స్థానిక కౌన్సిలర్, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, క్లస్టర్ భాద్యులు, తదితరులు ఉన్నారు.