Warangal: ప్రశాంతంగా ముగిసిన ఎస్సై రాత పరీక్షలు

హాజరైన 26వేల మంది అభ్యర్థులు సిటీలో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాట్లు వరంగల్ సీపీ అభినందనలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు రోజులుగా జరుగుతున్న ట్రైనీ పోలీస్ సబ్-ఇన్స్‌స్పెక్టర్ల ఉద్యోగ నియామక తుది రాత పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. స్టయిఫండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్.ఐ (సివిల్/ఎఆర్/టీఎస్ఎస్సీ/ ఎస్పీఎఫ్/ఎస్ఏఆర్/సిపియల్/ఫైర్ విభాగాల్లో సబ్-ఇన్స్పెక్టర్ స్థాయి పోలీస్ ఉద్యోగ నియామకాల్లోగా భాగం శని,ఆదివారాల్లో కమిషనరేట్ పరిధిలో 21 పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్షలను నిర్వహించారు. రెండవ […]

  • Publish Date - April 9, 2023 / 01:25 AM IST
  • హాజరైన 26వేల మంది అభ్యర్థులు
  • సిటీలో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాట్లు
  • వరంగల్ సీపీ అభినందనలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు రోజులుగా జరుగుతున్న ట్రైనీ పోలీస్ సబ్-ఇన్స్‌స్పెక్టర్ల ఉద్యోగ నియామక తుది రాత పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి.

స్టయిఫండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్.ఐ (సివిల్/ఎఆర్/టీఎస్ఎస్సీ/ ఎస్పీఎఫ్/ఎస్ఏఆర్/సిపియల్/ఫైర్ విభాగాల్లో సబ్-ఇన్స్పెక్టర్ స్థాయి పోలీస్ ఉద్యోగ నియామకాల్లోగా భాగం శని,ఆదివారాల్లో కమిషనరేట్ పరిధిలో 21 పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్షలను నిర్వహించారు.

రెండవ రోజు ఉదయం నిర్వహించిన మొదటి మూడవ పేపర్ పరీక్షకు 14076 మంది అభ్యర్థులకు గాను 13456 మంది అభ్యర్థులు హజరయ్యారు. 620 మంది అభ్యర్థులు గైర్హాజరైనారు. మధ్యాహ్నం నిర్వహించిన నాల్గవ పేపర్ పరీక్షకు 13412 మంది అభ్యర్థులు హజరుకాగా 664 మంది అభ్యర్థులు గైర్హాజరైనారు.

పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనీఖీ చేసి లోనికి అనుమతించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేయగా, ఐదుగురు ఇన్స్పెక్టర్లు రూట్ అఫీసర్లు విధులు నిర్వహించారు. డివిజన్ స్థాయిలో ఏసిపిలు, డిసిపి స్థాయి పోలీస్ అధికారులు బందోబస్తును పర్యవేక్షించారు.

ఎండలను దృష్టిలో వుంచుకోని ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బంది ఏర్పాటుచేశారు. అభ్యర్థుల కోసం బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్ళల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో భాగస్వామ్యమైన అందరిని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ అభినందించారు.