KTR| రేవంత్ రెడ్డితో చర్చకు మేము రెడీ

దమ్ముంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రా!
రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు
విధాత, హైదరాబాద్ : గోదావరి, కృష్ణ జలాలు..వ్యవసాయంపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు మేం సిద్దమని..రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అవసరం లేదని..మేం చాలని..దమ్ముంటే 8వ తేదీన సోమాజీగూడ ప్రెస్ క్లబ్ చర్చకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి చర్చకు ఆయన ముచ్చట పడుతున్నందునా.. బనకచర్లపై ఎపుడైనా, ఎక్కడైనా చర్చకు మేము రెడీ అన్నారు. చర్చకు రేవంత్ రెడ్డి చెప్పే డేట్..టైమ్..ప్లేస్ ఏదైనా మేం సిద్ధహన్నారు. చర్చకు మేమెప్పుడు ప్రిపేర్ అయ్యే ఉంటామని.. కాకుంటే వాళ్ళు ప్రిపేరవ్వాలి కాబట్టి 72 గంటలు టైమ్ ఇస్తున్నామన్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి బేసిన్లు..బెండకాయలు అని మాట్లాడితే సీఎం పదవి పరువు పోతదని..ఇప్పటికే బనకచర్ల ఏ బేసిన్ లో ఉందని..నల్లమల తెలంగాణలోనే ఉన్నదా అంటూ మాట్లాడిన మాటలు చూశామని తెలిపారు. ఆనాడు గోదావరి, కృష్ణా నీళ్ళు కిందకి తరలిపోతుంటే హారతులు పట్టిన పార్టీ కాంగ్రెస్.. పోరాడి రాష్ట్రాన్ని సాధించి, ఒక్కో నీటి బొట్టును ఒడిసిపట్టిన పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. వ్యవసాయాన్ని పండుగలా చేసింది ఎవరో తెలంగాణలో ఏ రైతును అడిగినా చెప్తారని కేటీఆర్ అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణను నెంబర్ వన్ చేసిందో ఎవరో అందరికీ తెలుసన్నారు. రేవంత్ రెడ్డికి అన్ని తెలుసు కానీ తెలియనట్లు నటిస్తున్నాడన్నారు. ప్రతి సభలో రేవంత్ సవాళ్లు, బూతులు, డైలాగులు కామన్ అని..నిన్న నా పేరు తీసి మరీ సవాల్ విసిరాడు కాబట్టి నేను రేవంత్ సవాల్ ని స్వీకరిస్తున్నానన్నారు.
రైతుల విషయంలో ఎవరేం చేశారో ఎక్కడ చర్చ పెడదాం చెప్పు అని సవాల్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు కాదు ముందు రేవంత్‌ను ఆయన స్వంత నియోజకవర్గంలో జెడ్పీటీసీలు గెలిపించుకో అని సవాల్ చేశారు. స్థానిక ఎన్నికలు పెట్టమనండి ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు వేసి ఏ వర్గం సంతోషంగా లేదని..వారంతా మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేస్తరని కేటీఆర్ ప్రశ్నించారు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అని చెప్పుకునే బాపతి కాంగ్రెస్ పార్టీ అని..ఇందుకు
కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అని రేవంత్ చెప్పుకుంటుండటమే నిదర్శనమన్నారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఏమైందని.. అశోక్‌నగర్‌కు వచ్చి నిరుద్యోగుల మధ్య చర్చ పెట్టే దమ్ముందా రాహుల్ గాంధీ? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చాకా బడ్జెట్ కాకుండా రూ.2లక్షల అప్పు అయ్యిందని..ఈ పైసలన్ని రైతులు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో కాకుండా.. టకీటకీ మని రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఖాతాల్లో పడుతున్నాయన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల పంపే దోపిడి సొమ్ముతో కొత్త ఏఐసీసీ భవనాలు కడుతున్నారని..తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చేసిన పే సీఎం రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని..పక్కా కోవర్టు పాలన అని..రాష్ట్రాన్ని ఏలుతున్నదే చంద్రబాబు కోవర్టు అని కేటీఆర్ ఆరోపించారు.